ఐపీఎల్‌ 2021: అతను వండర్స్‌ చేయగలడు

21 Apr, 2021 08:29 IST|Sakshi

చెన్నై: డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్ల తేడాతో గెలిచింది. చెపాక్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 138 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఢిల్లీ బ్యాటింగ్‌లో శిఖర్‌ ధవన్‌ 45 పరుగులతో ఆకట్టుకోగా.. స్టీవ్‌ స్మిత్‌ 33 పరుగులతో రాణించాడు. లలిత్‌ యాదవ్ ‌(22 నాటౌట్‌) ఫరవాలేదనిపించాడు. దాంతోపాటు ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌ అయిన లలిత్‌ యాదవ్ ముంబైని తక్కువ పరుగులకు కట్టడి చేయడంతో తన వంతు పాత్ర పోషించాడు.‌ నాలుగు ఓవర్లు వేసి 17 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్‌ సాధించి ఢిల్లీ విజయానికి సహకరించాడు.

మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌‌ మాట్లాడుతూ.. లలిత్‌ యాదవ్‌ను ప్రత్యేకంగా అభినందిచాడు. అతనొక గ్రేట్‌ ఇండియన్‌ క్రికెటర్ అ‌ని, అందుకే అవకాశం ఇచ్చామన్నాడు. ఈ తరహా పిచ్‌లపై వండర్స్‌ చేస్తాడనే తీసుకున్నామన్నాడు. అనుకున్నట్లగానే తమకు లాభించాడని పంత్‌ పేర్కొన్నాడు. తాము మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఒత్తిడిలో బరిలోకి దిగామని, అమిత్‌ మిశ్రా మమ్మల్ని రేసులోకి తీసుకొచ్చాడన్నాడు. బౌలర్లంతా తమ వంత పాత్ర సమర్థవంతంగా పోషించడంతో రోహిత్‌ సేనను తక్కువ పరుగులకు కట్టడి చేశామన్నాడు. చేతిలో వికెట్లు ఉంటే ఎంత టార్గెట్‌ అయినా ఛేదించవచ్చనే విషయాన్ని గత అనుభవాల నుంచి నేర్చుకున్నామన్నాడు. 

ఇక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అమిత్‌ మిశ్రా మాట్లాడుతూ.. ‘ బాల్స్‌ను గుడ్‌ ఏరియాలో వేయడానికి ట్రై చేశాను. వికెట్లు తీయడానికి యత్నించా. ఒక్కో బౌలర్‌కి ఒక్కో స్టైల్‌ ఉంటుంది. గాల్లో బంతిని స్పిన్‌ చేయడం నా స్టైల్‌. ఎక్కువగా స్పిన్‌ మార్చడాన్ని కోరుకోను. కొన్నిసార్లు వేగాన్ని కూడా జోడిస్తా. వికెట్‌ను అర్థం చేసుకుని బంతులు వేయడానికే యత్నిస్తా. ముంబై ఒక చాంపియన్‌ టీమ్‌. అటువంటి జట్టుపై బౌలింగ్‌ చేయడం చాలెంజింగ్‌గా స్వీకరిస్తా. ఒకానొక దశలో ఛేజింగ్‌ చేస్తామా అని చింతించా. చివరకు ముగింపు బాగుంది’ అని తెలిపాడు. 
(చదవండి: ఢిల్లీకి అమితానందం)

మరిన్ని వార్తలు