బెల్లీ డ్యాన్స్‌తో రచ్చ చేసిన పృథ్వీ షా గర్ల్‌ఫ్రెండ్‌

6 May, 2021 20:33 IST|Sakshi

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ ఆటగాడు పృథ్వీ షా ప్రాచి సింగ్‌ అనే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నట్లు కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా పృథ్వీ, ప్రాచిలు పీకల్లోతూ ప్రేమలో మునిగితేలుతున్నారని.. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ప్రత్యక్షమయ్యాయి. తాజాగా ప్రాచి బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాచి బెల్లీ డ్యాన్స్‌తో తనలోని డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ను వీలైతే ఒకసారి లుక్కేయండి.'' కరోనా విజృంభిస్తున్నవేళ మీకు ఉపశమనం కలిగించడానికి బెల్లీ ట్రై చేశా.. చూసి ఎలా ఉందో చెప్పండి'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. దీనికి సంబంధించిన వీడియోనూ ప్రాచి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

ఇక పృథ్వీ షా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ముఖ్యంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా 41 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు. ఇక ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్‌లో డకౌటై తీవ్ర విమర్శలపాలైన పృథ్వీ ఆసీస్‌తో సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌ సిరీస్‌కు కూడా ఎంపిక కాలేకపోయాడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగిన విజయ్‌ హజారే ట్రోఫీలో నాలుగు సెంచరీలతో  పరుగుల వరద పారించిన పృథ్వీ మళ్లీ ఫామ్‌ అందుకున్నాడు.
చదవండి: పృథ్వీ షా అరుదైన రికార్డు.. కోహ్లి, రోహిత్‌లను దాటేశాడు

పృథ్వీ షాకు ఐదు అవార్డులు.. గర్ల్‌ఫ్రెండ్‌ సెటైర్‌

A post shared by Prachi Singh (@prachisingh2202)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు