పృథ్వీ షాకు ఐదు అవార్డులు.. గర్ల్‌ఫ్రెండ్‌ సెటైర్‌

30 Apr, 2021 18:38 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.  ఢిల్లీ చేజింగ్‌ చేసే సమయంలో పృథ్వీ షా 41 బంతుల్లో 11 ఫోర్లు,  3 సిక్స్‌లతో 82 పరుగులు చేసి జట్టు ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో పృథ్వీ షా ఏకంగా ఐదు అవార్డులు గెలుచుకోవడం విశేషం. 

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుతో పాటు, సఫారీ సూపర్‌ స్టైకర్‌(200 స్టైక్‌రేట్‌) అవార్డు, గేమ్‌ ఛేంజర్‌ అవార్డు(117 ఫాంటసీ పాయింట్లు), క్రెడ్‌ పవర్‌ ప్లేయర్‌ అవార్డు(పవర్‌ ప్లేలో 48 నాటౌట్‌ 16 బంతుల్లో), అప్‌స్టాక్స్‌ మోస్ట్‌ వాల్యూబుల్‌ అసెట్‌ అవార్డు(అప్‌స్టాక్స్‌ క్రిక్‌ఇన్‌డెక్స్‌ 38 పాయింట్లతో)లు గెలుచుకున్నాడు. తన ప్రదర్శనతో విమర్శించిన వారితో ప్రశంసలు అందుకున్న పృథ్వీ షాకు గర్ల్‌ఫ్రెండ్‌ ప్రాచి సింగ్‌ కూడా అభినందనలు తెలిపింది.

తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పృథ్వీ షాను విష్‌ చేస్తూ.. ‘ నిన్ను చూస్తే గర్వంగా ఉంది’ అని అన్న ప్రాచి..  ఐదు అవార్డులు తీసుకోవడంపై సెటైరికల్‌ మరో పోస్ట్‌ చేసింది. పృథ్వీ షా అందుకున్న అవార్డులన్నింటినీ కలిపి ఒక ఫోటోలో జత చేసిన ప్రాచి.. ‘ఆ అవార్డుల్నింటిని తీసుకెళ్లడానికి కొత్త సూట్‌ కేసు కావాలేమో’ అని  కామెంట్‌ చేసింది. గత కొంతకాలంగా బాలీవుడ్‌ హాట్‌ హీరోయిన్‌ అయిన ప్రాచి సింగ్‌తో పృథ్వీ షా ప్రేమాయణం నడుపుతున్నాడనే వార్తలు వచ్చాయి. కాగా, దీనిపై ఇరువురి వద్ద నుంచి క్లారిటీ లేదు. కానీ పృథ్వీ షా ప్రదర్శనపై ప్రాచి స్పందించడంతో వారి మధ్య ఏదో ఉందనే గుసగుసలు మళ్లీ వినిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు