Ravi Bishnoi: నా మీద ఆ ముగ్గురి ప్రభావం గట్టిగా ఉంది.. అందుకే

1 Oct, 2021 18:42 IST|Sakshi
Courtesy: IPL Twitter

3 Leg Spinners Who Influenced Ravi Bishnoi.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌ జట్టుగా విఫలమైనప్పటికీ.. లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయి మాత్రం సక్సెస్‌ అయ్యాడు. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లాడిన అతను 6.08 ఎకానమీ రేటుతో తొమ్మిది వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబరిచాడు. తాజాగా రవి బిష్ణోయి క్రికెట్‌.కామ్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. '' నా బౌలింగ్‌ శైలిలో ముగ్గురి ప్రభావం గట్టిగా ఉంది. వారే విండీస్‌ బౌలర్‌ శామ్యూల్స్‌ బద్రీ, దక్షిణాఫ్రికా లెగ్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌, అమిత్‌ మిశ్రాలు. అయితే ఈ ముగ్గురు నుంచి ఒక్కో క్వాలిటిని నేను పొందిపుచ్చుకున్నా.

బద్రీ నుంచి బౌలింగ్‌లో కచ్చితత్వం.. తాహిర్‌ నుంచి ఉత్సాహం.. మిశ్రా నుంచి వైవిధ్యం.. మోసపూరిత బౌలింగ్‌ను పొందినట్లుగా అనిపిస్తుంది. బద్రీ కొత్త బాల్‌తో అద్భుతం చేస్తాడు.. తాహిర్‌ వికెట్లు తీసిన కొద్ది ఉత్సాహంగా తయారవుతాడు.. ఇక అమిత్‌ జీ ఈ విషయంలో మరికాస్త ముందుంటాడు. తన సంప్రదాయ లెగ్‌స్పిన్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లకు వైవిధ్యమైన బౌలింగ్‌ చేస్తూ వారిని మోసం చేస్తుంటాడు. అందుకే ఈ ముగ్గురి బౌలింగ్‌ శైలి నాకు స్పెషల్‌గా కనిపించింది. వారిలోని వైవిధ్యతలను పొందడం నా అదృష్టం'' అని చెప్పుకొచ్చాడు. కాగా పంజాబ్‌ కింగ్స్‌ గత సీజన్‌లో రవి బిష్ణోయిని రూ. 2 కోట్లకు దక్కించుకుంది. కాగా 2020 అండర్‌-19 వరల్డ్‌కప్‌లో రవి బిష్ణోయి 17 వికెట్లతో ఆకట్టుకున్నాడు.

చదవండి: Virender Sehwag: ప్రత్యర్థి ఆటగాడిని దూషించాడు.. మనోడైనా తిట్టాడు; అది క్రీడాస్పూర్తి

Chris Gayle: అందుకే నేను తప్పుకొంటున్నా...

>
మరిన్ని వార్తలు