కళ్లు చెదిరే షాట్‌‌.. ఏంటి పృథ్వీ బంతి కనపడలేదా 

2 Oct, 2021 18:11 IST|Sakshi
Courtesy: IPL Twitter

Prithwi Shaw Confused Didnt Find Ball.. ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్‌ సమయంలో ఆసక్తికర ఘటన జరిగింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ రబడ వేశాడు. ఆ ఓవర్‌ నాలుగో బంతిని కృనాల్‌ పాండ్యా మిడ్‌వికెట్‌ దిశగా కళ్లు చెదిరే షాట్‌ ఆడాడు. అయితే అక్కడే ఉన్న పృథ్వీ షాకు బంతి కనపడక దిక్కులు చూశాడు. కృనాల్‌ కొట్టిన వేగవంతమైన షాట్‌ అతనికి కాస్త దూరంగా వెళ్లినప్పటికీ అతను బంతిని మాత్రం గుర్తించలేకపోయాడు. ఆ తర్వాత రబడ, పంత్ పృథ్వీ షావైపు చూస్తూ.. ఏంటి పృథ్వీ.. బంతి కనపడలేదా అని చెప్పగానే నవ్వులు పూశాయి. 

ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ముంబై బ్యాటర్స్‌ ఏ దశలోనూ రాణించలేకపోయారు. సూర్యకుమార్‌ యాదవ్‌ 33 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఏడు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. 

చదవండి: Rohit And Pant: టాస్‌ సమయంలో పంత్‌, రోహిత్‌ల మధ్య ఏం జరిగింది!

మరిన్ని వార్తలు