ధోని భయ్యా.. నాకు ఎల్‌ సైజ్‌ జెర్సీ పంపు: జడేజా

25 Mar, 2021 10:41 IST|Sakshi

చెన్నై: టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సరదాగా ట్రోల్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలు విషయంలోకి వెళితే.. 2021 ఐపీఎల్‌ కోసం సీఎస్‌కే రూపొందించిన కొత్త జెర్సీలో ఆటగాళ్ల భుజాలపై ఈ ‘క్యామోఫ్లాజ్‌’ను ముద్రిం‍చారు. ఈ జెర్సీని బుధవారం ధోని స్వయంగా ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ధోనికి భారత ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా గౌరవ హోదా కూడా ఉంది. భారత సైనికులకు సంఘీభావంగా ‘క్యామోఫ్లాజ్'ను  ముద్రించినట్లు సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్‌ వెల్లడించారు.

ఇదే విషయాన్ని సీఎస్‌కే తన ఇన్‌స్టాగ్రామ్‌లో వినూత్న రీతిలో కామెంట్స్‌ రాసుకొచ్చింది. 'దేశంకోసం సేవ చేస్తున్న సైనికులకు మేమిచ్చే అరుదైన గౌరవం ఇదే. వాళ్లు నిజమైన హీరోలు.. తలా(ధోనితో) జెర్సీని ఆవిష్కరించాం.. ఈ ఏడాది కొత్త జెర్సీతో బరిలోకి దిగుతున్నాం.. రెడీగా ఉండండి. విజిల్‌ పోడూ 'అంటూ రాసుకొచ్చింది. సీఎస్‌కే పెట్టిన కామెంట్స్‌పై జడేజా స్పందిస్తూ.. 'నాకు ఒక ఎల్‌ సైజ్‌ జెర్సీ పంపండి.. ప్లీజ్‌' అంటూ కామెంట్‌ చేశాడు.

దీనికి బదులుగా సీఎస్‌కే మీ ప్రతిపాదనకు మేం సిద్ధంగా ఉన్నాం.. మీ జెర్సీని ముంబైకి డెలివరీ చేస్తాం అంటూ రిప్లై ఇచ్చింది. ఇక ఐపీఎల్‌ సీజన్‌ ఏప్రిల్‌ 9న ప్రారంభమై.. మే 30 వరకు జరగనుంది. ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సీఎస్‌కే తొలి మ్యాచ్‌ను ముంబై వేదికగా ఏ‍ప్రిల్‌ 10న‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. ఇప్పటికే సీఎస్‌కే జట్టు తమ ప్రాక్టీస్‌ను ఆరంభించింది. కాగా చెన్నై జట్టు ఐపీఎల్‌లో మూడుసార్లు(2010, 2011,2018)లో టైటిల్‌ విజేతగా నిలిచింది.
చదవండి: 
సీఎస్‌కే జెర్సీపై ‘క్యామోఫ్లాజ్‌’ 
పెళ్లి చేసుకోబోతున్న క్రికెటర్‌.. ఐపీఎల్‌ మ్యాచ్‌కు దూరం!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు