World Cup 2023: వరల్డ్‌ నెంబర్‌ 1 బౌలర్‌గా షాహిన్‌ అఫ్రిది..

1 Nov, 2023 19:48 IST|Sakshi

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ స్పీడ్‌ స్టార్‌ షాహిన్‌ షా అఫ్రిది అదరగొట్టాడు. తొలిసారి వరల్డ్‌ నెంబర్‌ 1 బౌలర్‌గా అవతరించాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్న అఫ్రిది.. ఏకంగా 7 స్ధానాలు ఎగబాకి అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ని వెనక్కినెట్టి 673 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌-1లోకి షాహీన్‌ దూసుకువచ్చాడు.

కాగా ఏ ఫార్మాట్‌లోనైనా నెం.1 ర్యాంక్‌ను చేరుకోవడం అఫ్రిదికి ఇదే మొదటి సారి. వన్డే ప్రపంచకప్‌-2023లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన అఫ్రిది 16 వికెట్లతో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. 

వంద వికెట్ల మైలురాయి..
అంతర్జాతీయ వన్డేల్లో మరో అరుదైన ఘనతను అఫ్రిది అందుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా అఫ్రిది రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహీన్‌ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లతో షాహీన​ చెలరేగాడు.
చదవండి: World cup 2023: చరిత్ర సృష్టించిన డికాక్‌.. వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలోనే!

మరిన్ని వార్తలు