IPL 2024: 'అత‌డొక విధ్వంస‌క‌ర ఆట‌గాడు.. మీరు అలా చేయడం కరెక్ట్ కాదు'

29 Mar, 2024 18:12 IST|Sakshi
PC:IPL.com

ఐపీఎల్‌-2024 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వ‌రుస‌గా రెండో ఓట‌మి చ‌విచూసింది. గురువారం జైపూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 12 ప‌రుగుల‌తో తేడాతో ఢిల్లీ ఓట‌మి పాలైంది. కాగా వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ  పృథ్వీ షాకు ఢిల్లీ తుది జ‌ట్టులో చోటు దక్క‌లేదు.

అత‌డి స్ధానంలో ఆంధ్ర ఆట‌గాడు రికీ భుయ్‌కు ఢిల్లీ జ‌ట్టు మెనెజ్‌మెంట్ అవ‌కాశ‌మిచ్చింది. ఈ క్ర‌మంలో పృథ్వీ షాను కేవ‌లం బెంచ్‌కే ప‌రిమితం చేయ‌డాన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ త‌ప్పుబ‌ట్టాడు.

"పృథ్వీ షా అద్భుత‌మైన ఆట‌గాడు. అత‌డికి అంత‌ర్జాతీయ స్ధాయిలో ఆడిన అనుభ‌వం ఉంది. ఆటువంటి ఆట‌గాడిని డగౌట్‌లో ఎందుకు కూర్చునిబెట్టారో నాకు ఆర్ధం కావ‌డం లేదు. గ‌త సీజ‌న్‌లో అత‌డు బాగా రాణించ‌క‌పోవ‌చ్చు.

కానీ అత‌డు చాలా డేంజ‌ర‌స్ క్రికెట‌ర్‌. కాబ‌ట్టి అత‌డికి అవ‌కాశాలు ఇవ్వాలి. అంతే త‌ప్ప డ‌గౌట్‌లో కూర్చోనిబెడితే ప‌రుగులు చేయ‌లేడు కదా" అని మూడీ ఈఎస్పీఎన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మూడీ పేర్కొన్నాడు.

కాగా గ‌తేడాది సీజ‌న్‌లో షా దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. ఐపీఎల్‌-2023లో పృథ్వీ షా ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 13.25 సగటుతో కేవలం 106 పరుగులు మాత్రమే చేసాడు. అయితే అంత‌కుముందు సీజ‌న్‌లలో మాత్రం పృథ్వీ అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. కాగా త‌ర్వాతి మ్యాచ్‌ల్లోనైనా పృథ్వీ షాకు ఢిల్లీ తుది జ‌ట్టులో చోటు ద‌క్కుతుందో లేదో వేచి చూడాలి.
 

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers