వెంకటేశ్‌ అయ్యర్‌ నిశ్చితార్థం ఫొటోలు వైరల్‌.. అమ్మాయి ఎవరంటే?!

21 Nov, 2023 14:42 IST|Sakshi

Venkatesh Iyer Engagement Pics: టీమిండియా క్రికెటర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ తన అభిమానులుకు శుభవార్త చెప్పాడు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. తనకు నిశ్చితార్థమైన విషయాన్ని తెలియజేస్తూ.. కాబోయే శ్రీమతితో దిగిన ఫొటోలు పంచుకున్నాడు.

ఈ మేరకు.. ‘‘నా జీవితంలో తదుపరి అధ్యాయానికి నాంది’’ అంటూ మంగళవారం ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. ఈ క్రమంలో కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ సహా హర్‌ప్రీత్‌ బ్రార్‌ తదితరులు వెంకటేశ్‌ను విష్‌ చేశారు.

ఫ్యాషన్‌ డిజైనర్‌!
కాగా వెంకటేశ్‌ అయ్యర్‌కు కాబోయే భార్య పేరు శృతి రఘునాథన్‌. పీఎస్‌జీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌లో బీకామ్‌ చదివిన శృతి.. నిఫ్ట్‌(NIFT) నుంచి ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ తీసుకున్నట్లు సమాచారం. ఆమె ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

టీమిండియా తరఫున అరంగేట్రం చేసి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించిన వెంకటేశ్‌ అయ్యర్‌.. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. స్వదేశంలో 2021లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌.. మరుసటి ఏడాది వన్డేల్లోనూ అరంగ్రేటం చేశాడు.

ఇక ఐపీఎల్‌-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన 28 ఏళ్ల అయ్యర్‌కు కొన్నాళ్లుగా భారత జట్టులో చోటు కరువైంది. కాగా తన అంతర్జాతీయ కెరీర్‌లో వెంకటేశ్‌ ఇప్పటి వరకు.. 2 వన్డే, 9 టీ20 మ్యాచ్‌లు ఆడి వరుసగా 24, 133 పరుగులు సాధించాడు. టీ20 ఫార్మాట్లో 5 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: గెలుపోటములు సహజం.. అదొక్కటే విషాదం! కోహ్లిని ఓదార్చిన సచిన్‌

A post shared by Venkatesh R Iyer (@venky_iyer)

మరిన్ని వార్తలు