IPL 2024: అలా అయితే ఈసారి ట్రోఫీ ముంబై ఇండియన్స్‌దే! 3 ప్రధానాంశాలు

19 Mar, 2024 17:30 IST|Sakshi
రోహిత్‌ శర్మ- హార్దిక్‌ పాండ్యా (పాత ఫొటో- PC: IPL/BCCI)

IPL 2024: Can Hardik Pandya Guide Mumbai Indians To Sixth Title?: ఐపీఎల్‌-2023లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది ముంబై ఇండియన్స్‌. క్వాలిఫైయర్‌-2 వరకు చేరుకుంది. కానీ.. కీలక పోరులో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. అయితే, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది ఉత్తమ ప్రదర్శనే.

ఎందుకంటే 2022లో ఏకంగా పదో స్థానానికి దిగజారిన రోహిత్‌ సేన.. 2023లో టాప్‌-3లో నిలవడం విశేషం. తద్వారా తాజా ఎడిషన్‌లో టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతుందనడంలో సందేహం లేదు.

అయితే, కెప్టెన్‌ మార్పు అంశంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముంబైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ శర్మ వైపు అత్యధికులు మొగ్గుచూపితే.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించడమే సరైందని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ఈసారి ముంబై ఇండియన్స్‌ చాంపియన్‌గా నిలవడానికి దోహదం చేసే మూడు ప్రధాన అంశాలను గమనిద్దాం!

సూపర్‌ ఫామ్‌లో హార్దిక్‌ పాండ్యా!
ఐపీఎల్‌ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మంచి ఫామ్‌లో ఉన్నాడు. గతంలో సారథిగా వ్యవహరించిన అనుభవం లేకున్నా.. అరంగేట్ర సీజన్‌లోనే గుజరాత్‌ టైటాన్స్‌కు టైటిల్‌ అందించిన ఘనత అతడి సొంతం.

గతేడాది కూడా జట్టును ఫైనల్‌ వరకు తీసుకువచ్చాడు. ఒత్తిడిలోనూ ఆటగాడిగా ‍కూడా రాణించడం పాండ్యాకు ఉన్న అదనపు బలం. ఆటగాళ్ల సేవలను సరైన విధంగా ఉపయోగించుకుంటూ మైదానంలో తన వ్యూహాలను అమలు చేయడంలోనూ అనుభవం గడించడం ముంబై ఇండియన్స్‌కు సానుకూలాంశం.

టీమిండియా ఉత్తమ బ్యాటర్లూ ఇక్కడే!
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌, టీ20 స్టార్‌ సూర్యకుమార్ యాదవ్‌, యంగ్‌ సెన్సేషన్‌ తిలక్‌ వర్మ రూపంలో మేటి బ్యాటర్లను కలిగి ఉండటం ముంబై ఇండియన్స్‌కు కలిసి వచ్చే అంశం.

ఇక హార్దిక్‌ పాండ్యా రూపంలో మేటి ఆల్‌రౌండర్‌ అందుబాటులో ఉండనే ఉన్నాడు. ఇలా అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల సమాహారంతో ముంబై బ్యాటింగ్‌ ఆర్డర్‌ టాప్‌-5 పటిష్టంగా కనిపిస్తోంది. అవసరమైన సమయంలో ఏ ఒక్కరు బ్యాట్‌ ఝులిపించినా ప్రత్యర్థి జట్టు బెంబేలెత్తడం ఖాయం.

వీరితో పాటు యువ విధ్వంసకర ఆటగాళ్లు నేహల్‌ వధేరా, విష్ణు వినోద్‌ కూడా సమయం వచ్చినపుడు మైదానంలో దిగేందుకు సిద్ధంగా ఉండటం ప్లస్‌ పాయింట్‌.

విదేశీ బౌలర్లను వాడేయొచ్చు!
భారత ఆటగాళ్లతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా ఉంది కాబట్టి బౌలింగ్‌ దళంలో విదేశీ ప్లేయర్లను ఎక్కువగా వాడుకునే సౌలభ్యం ముంబై ఇండియన్స్‌కు ఉంది. నిబంధనల ప్రకారం.. తుదిజట్టులో నలుగురు ఫారిన్‌ ప్లేయర్లకు మాత్రమే చోటివ్వాల్సి ఉంటుంది కాబట్టి.. ముంబై ముగ్గురూ బౌలర్లు ముఖ్యంగా పేసర్లను వాడుకున్నా ఇబ్బంది లేదు.

పేస్‌ దళ నాయకుడిగా ఉన్న  టీమిండియా స్టార్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు నువాన్‌ తుషార, గెరాల్డ్‌ కోయెట్జి, దిల్షాన్‌ మధుశాంకలను బరిలోకి దించే అవకాశం ఉంటుంది. వీరిలో తుషారను డెత్‌ ఓవర్లలో ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా పరిగణించనూవచ్చు. పైన చెప్పినట్లుగా ఈ మూడు ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే ముంబై ఇండియన్స్‌కు తిరుగుండదు అంటున్నారు విశ్లేషకులు! 

ముంబై ఇండియన్స్‌ -2024 జట్టు
రోహిత్ శర్మ
డెవాల్డ్ బ్రెవిస్‌*
సూర్యకుమార్ యాదవ్
ఇషాన్ కిషన్
తిలక్ వర్మ
టిమ్ డేవిడ్*
విష్ణు వినోద్
అర్జున్ టెండూల్కర్
షామ్స్ ములానీ
నేహాల్ వధేరా
జస్‌ప్రీత్‌ బుమ్రా
కుమార్ కార్తికేయ
పీయూష్ చావ్లా
ఆకాష్ మధ్వల్
ల్యూక్‌ వుడ్‌(జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ రీప్లేస్‌మెంట్‌)*
హార్దిక్ పాండ్యా (GT నుండి ట్రేడింగ్‌)
రొమారియో షెపర్డ్* (RCB నుండి ట్రేడింగ్‌) 
గెరాల్డ్ కోయెట్జీ* (వేలం - 5.00 కోట్లు)
దిల్షాన్ మధుశాంక (వేలం - 4.60 కోట్లు) 
శ్రేయాస్ గోపాల్ (వేలం - 20 లక్షలు) 
నువాన్ తుషార* (వేలం - 4.80 కోట్లు) 
నమన్ ధీర్ (వేలం - 20 లక్షలు) 
అన్షుల్ కాంబోజ్ (వేలం - 20 లక్షలు) 
మహ్మద్ నబీ* (వేలం - 20 లక్షలు) 
శివాలిక్ శర్మ (వేలం - 20 లక్షలు
*- విదేశీ ప్లేయర్లు

చదవండి: సబలెంక జీవితంలో తీవ్ర విషాదం.. భాగస్వామి హఠాన్మరణం

Election 2024

Poll
Loading...
మరిన్ని వార్తలు
Greenmark Developers