విద్యార్థి భవితకు బాటలు

27 Apr, 2023 01:22 IST|Sakshi
మెగా చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

పుట్టపర్తి అర్బన్‌: ఆర్థిక ఇబ్బందులతో ఏ పేద విద్యార్థి చదువు ఆగకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివిధ పథకాలు అమలు చేస్తూ వారి భవితకు బాటలు వేస్తున్నారని కలెక్టర్‌ అరుణ్‌బాబు అన్నారు. బుధవారం అనంతపురం జిల్లా నార్పలలో జరిగిన కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌నొక్కి ‘జగనన్న వసతి దీవెన’ నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జిల్లా అగ్రీ అడ్వయిజరీ బోర్డు చైర్మన్‌ అవుటాల రమణారెడ్డి, ‘పుడా’ చైర్‌పర్సన్‌ లక్ష్మీనరసమ్మ, ఆర్డీఓ భాగ్యరేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు జిల్లాలోని లబ్ధిదారులకు జగనన్న వసతి దీవెన మెగా చెక్కు అందజేశారు. అనంతరం కలెక్టర్‌ అరుణ్‌బాబు మాట్లాడుతూ, ఉన్నత చదవులు అభ్యసిస్తున్న పేద విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పేరుతో మొత్తం ఫీజు రీయింబర్స్‌ చేస్తోందన్నారు. అలాగే వసతి, భోజన ఖర్చుల కోసం వసతి దీవెన పేరుతో ఏటా రెండు వాయిదాల్లో ఆర్థిక సాయం అందజేస్తూ అందుకుంటోందన్నారు. ఇందులో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు రూ.20 వేలు అందజేస్తూ పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడుతున్నారన్నారు. ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు.

నాడు అరకొర.. నేడు అడిగినంత..

జిల్లా అగ్రి అడ్వయిజరీ బోర్డు చైర్మన్‌ అవుటాల రమణారెడ్డి, పుడా చైర్‌ పర్సన్‌ లక్ష్మీనరసమ్మ మాట్లాడుతూ, టీడీపీ హయాంలో ఉన్నత చదువులు అభ్యసించాలంటే నిరుపేద కుటుంబాల విద్యార్థులు భయపడేవారన్నారు. అరకొర ఫీజురీయంబర్స్‌మెంట్‌ చెల్లించడంతో చాలా మంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నారన్నారు. కానీ సీఎం జగనన్న విద్యారంగానికి అడినన్ని నిధులు కేటాయిస్తూ విద్యార్థుల ఉజ్వల భవితకు బాటలు వేస్తున్నారన్నారు. కేవలం నాలుగేళ్లలోనే విద్య కోసం రాష్ట్రంలో రూ.59 వేల కోట్లు ఖర్చు చేశారని, బహుశా దేశంలోనే ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా ఉండరన్నారు. ‘జగనన్న వసతి దీవెన’కు 35,080 మంది విద్యార్థులు అర్హత సాధించగా, వారి తల్లు ఖాతాలో రూ.33.68 కోట్లు జమ చేశామన్నారు. కార్యక్రమంలో సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ శివరంగప్రసాద్‌, బీసీ వెల్ఫేర్‌ అఽధికారి నిర్మలాజ్యోతి, జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ మోహన్‌రామ్‌, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పేదల చదువుకు సీఎం జగన్‌

భరోసా ఇస్తున్నారు

‘జగనన్న వసతి దీవెన’

ప్రారంభోత్సవంలో కలెక్టర్‌ అరుణ్‌బాబు

జిల్లాలోని 35 వేల మంది తల్లుల ఖాతాల్లో రూ.33.68 కోట్లు జమ

>
మరిన్ని వార్తలు