హుస్నాబాద్‌ సభకు స్మృతి ఇరానీ

1 Oct, 2021 04:58 IST|Sakshi

సభ ఏర్పాట్లపై పార్టీ నేతలతో బండి భేటీ 

సాక్షి, సిద్దిపేట: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన తొలిదశ ప్రజా సంగ్రామ పాదయాత్ర అక్టోబర్‌ 2న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ముగియనున్న నేపథ్యంలో పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వ హించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా గురువారం వివిధ జిల్లాల బీజేపీ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులతో బండి సంజయ్‌ భేటీ అయ్యారు. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, పాదయాత్ర ప్రముఖ్‌ డాక్టర్‌ జి.మనోహర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాక: గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్‌ 2న ఉదయం కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కలసి బండి సంజయ్‌ హుస్నాబాద్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి పట్టణమంతా రోడ్‌షో నిర్వహించి మధ్యా హ్నం 12 గంటలకు అంబేడ్కర్‌ సెంటర్‌లో  బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా, సంజయ్‌ చేపట్టిన పాదయాత్ర  సిద్దిపేట జిల్లా కోహెడ, హుస్నాబాద్‌లలో కొనసాగింది.  

మరిన్ని వార్తలు