ఇక్కడ నీకేం పని.. కానిస్టేబుల్‍పై సీఐ లాఠీఛార్జ్

1 Dec, 2023 09:20 IST|Sakshi

హైదరాబాద్: ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాదర్‌గుల్‌లోని పోలింగ్‌ కేంద్రం ఓ సీఐ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై లాఠీ ఝులిపించారు.మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్‌ నాదర్‌గుల్‌లోని జిల్లా పరిషత్తు పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఏఆర్‌ కానిస్టేబుల్‌ యాదగిరి పోలింగ్ కేంద్రం బయట ఎదురుచూస్తున్నారు. 

పెట్రోలింగ్‌ వాహనంలో ఆదిభట్ల ఇన్‌స్పెక్టర్‌ రఘువీర్‌ రెడ్డి అక్కడకు వచ్చారు. ఇన్‌స్పెక్టర్‌ను చూసిన కానిస్టేబుల్‌ సెల్యూట్‌ చేసేందుకు ప్రయత్నించారు.. అంతలోనే సీఐ 'ఇక్కడ నీకేం పని' అని ప్రశ్నిస్తూ కానిస్టేబుల్‌ను లాఠీతో కొట్టారు. దాంతో కానిస్టేబుల్ అక్కడి నుంచి పరుగులు తీశారు.

మరిన్ని వార్తలు