ముంచుకొస్తున్న థర్డ్‌ వేవ్‌.. ముంబై తర్వాత హైదరాబాదే.. కోవిడ్‌ కేసుల్లో కాదు

12 Jan, 2022 15:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నా.. థర్డ్‌ వేవ్‌ భయాలు అన్ని రాష్ట్రాలను చుట్టుముడుతున్నా.. ప్రజలు మాస్క్‌ ధరించడంలో నిర్లక్ష్యం వీడటం లేదు. కరోనా మార్గదర్శకాలను పాటించాలని, పక్కాగా మాస్క్‌ ధరించాలని ప్రభుత్వాలు పదేపదే కోరుతున్నా పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్‌ సహా దేశ వ్యాప్తంగా ముంబై, సిమ్లా, కోల్‌కతా, జమ్మూ, చెన్నై, గువాహటి, చండీగఢ్, పుణే, రాయ్‌పూర్‌లలో డిజిటల్‌ ఇండియా ఫౌండేషన్‌ నవంబర్, డిసెంబర్‌ మాసాలలో మాస్కుల ధరింపుపై సర్వే నిర్వహిస్తే ఒక్క ముంబై మినహా మరే నగరంలోనూ 50 శాతానికి మించి ప్రజలు మాస్కులు ధరించట్లేదని తేటతెల్లమైంది.


చదవండి: సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌: మంత్రి క్లారిటీ

మాస్కులను పురుషులకన్నా మహిళలే ఎక్కువగా ధరిస్తున్నట్టు వెల్లడైంది. ఇందులో అత్యధికంగా ముంబైలో 76.28 శాతం మంది మాస్కులు ధరిస్తుండగా, మిగతా ఏ నగరంలోనూ 50 శాతానికి మించి ధరించడం లేదని తేలింది. ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే 45.75శాతం మంది పూర్తి స్థాయిలో, 17.10 శాతం మంది పాక్షికంగా మాస్కులు ధరిస్తున్నారు. 
చదవండి: యూపీలో బీజేపీ భారీ షాక్‌.. 24 గంటల వ్యవధిలో..

కాగా తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 1,920 కరోనా కేసులు రికార్డయినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో ప్రకటించింది. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,015 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కరోనా కేసులు 6,97,775కు చేరింది. ఇక మంగళవారం 83,153 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అదే విధంగా మహారాష్ట్రలో కొత్తగా 34,424 కేసులు వెలుగు చూశాయి. వీటిలో ముంబైలోనే 11,647 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,21,477కు చేరింది. ఇక రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసులు1,281కి పెరిగాయి. 

చదవండి: కరోనా కల్లోలం: భారత్‌లో భారీగా పెరిగిన కేసులు..

మరిన్ని వార్తలు