కరోనా టెర్రర్‌ : ఆ జిల్లాలో​ ఒక్కరోజే 304 మందికి కరోనా పాజిటివ్‌..

15 Jun, 2021 08:24 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, నెట్‌వర్క్‌ (నల్లగొండ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. సోమవారం ఒక్కరోజే 304మంది మహమ్మారి బారిన పడినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఆయా మండలాల పరిధిలో నమోదైన కేసుల వివరాలు.. భూదాన్‌పోచంపల్లి మండలంలో 9మందికి, జాజిరెడ్డిగూడెం మండలంలో ముగ్గురికి, కట్టంగూర్‌లో ఆరుగురికి, త్రిపురారం మండలంలో ఐదుగురికి, వలిగొండ మండలంలో 20మందికి, మిర్యాలగూడలో 34మందికి, గుండాల మండలంలో 9మందికి, తిరుమలగిరిలో ఐదుగురికి, చౌటుప్పల్‌లో 17మందికి, భువనగిరిలో 15మందికి, అడవిదేవులపల్లిలో 8మందికి, దేవరకొండలో ఆరుగురికి, కేతేపల్లిలో 9మందికి, ఆలేరులో ఆరుగురికి, యాదగిరిగుట్ట మండలంలో ముగ్గురికి, చిట్యాల మండలంలో నలుగురికి, నడిగూడెం మండలంలో ఒకరికి, శాలిగౌరారం మండలంలో 18మందికి, మోత్కూరులో 9మందికి, నాగార్జునసాగర్‌లో 19మందికి, డిండిలో 11మందికి, రాజాపేటలో నలుగురికి, మోతెలో 10, తుంగతుర్తిలో 8మందికి, బొమ్మలరామారం మండలంలో ఆరుగురికి, నకిరేకల్‌లో 35మందికి, సంస్థాన్‌నారాయణపురంలో ఇద్దరికి, నాంపల్లి మండలంలో నలుగురికి, అడ్డగూడూరులో ఒకరికి, మునుగోడులో 17మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 

కరోనాతో నలుగురి మృతి
అర్వపల్లి: కరోనా మహమ్మారి సోకిన నలుగురు మృతిచెందారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. జాజారెడ్డిగూడెం మండలం  కాసర్లపహాడ్‌ గ్రామంలో కరోనాతో 55 ఏళ్ల వృద్ధురాలు సోమవారం మృతిచెందింది. ఆమె అంతిమ సంస్కారాన్ని స్వేరో సంస్థ ఆధ్వర్యంలో టీజీపీఏ రాష్ట్ర కార్యదర్శి మచ్చ నర్సయ్యతో పాటు మరి కొందరు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దబ్బేటి జ్యోతిరాణి, డాక్టర్‌ రాజేష్, సుజాత, ఎల్లమ్మ, సైదులు, శ్రీనివాస్, భిక్షం పాల్గొన్నారు.

తిరుమలగిరిలో ఒకరు..
తిరుమలగిరి మున్సిపాలిటీ పరి­ధిలోని మూల రాంరెడ్డి (73)కి ఇటీవల వైరస్‌ సోకింది. కుటుంబ సభ్యులు అతడిని సికింద్రాబాద్‌లో గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందు­తూ మృతిచెందాడు. సోమవారం స్వగ్రామంలో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు.  

నాగారంలో వృద్ధుడు..
మండల కేంద్రానికి చెందిన తజ్జం కృష్ణమూర్తి(59) మూత్రపిండాల వ్యా«ధితో బాధపడు తూ  వారంరోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. రెండురోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు  గురి­కావడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.అక్కడ  వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా సోకినట్లుగా నిర్ధారించారు. కృష్ణమూర్తి అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.

నకిరేకల్‌లో ఆర్‌ఎంపీ..
మండలంలోని నోముల గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ బుడిదపాటి రామిరెడ్డి(57)కి ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ వచ్చింది.  ఇంటి వద్దే ఉంటూ చికిత్స పొందుతున్నాడు. ఆదివారం ఉదయం  అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతిచెందాడు. రామిరెడ్డి మతదేహాన్ని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్‌ సందర్శించి సంతాపం తెలిపి నివాళులర్పించారు. సంతాపం తెలిపిన వారిలో కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి యాస కర్ణాకర్‌రెడ్డి,  సామ రవీందర్, రాచకొండ లింగయ్య, వెంకట్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 

చదవండి: పోస్ట్‌ కోవిడ్‌లో కొత్తరకం సమస్య.. ‘వైరల్‌ ఆర్‌థ్రాల్జియా’

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు