కరోనా కాలం: అపోహలు, వాస్తవాలు

29 Apr, 2021 09:02 IST|Sakshi

ఈ విషయాల్లో ఏమాత్రం వాస్తవం లేదు

ఆల్కహాల్‌ తీసుకుంటే కరోనా రాదా? 
ఈ విషయంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఆల్కహాల్‌ తీసుకోవడం ఎప్పటికీ ప్రమాదకరమే. ఆరోగ్య సమస్యలను రెండింతలు చేయడంలో ఆల్కహాల్‌ ముఖ్య భూమిక పోషిస్తుంది. 

10 సెకండ్లు శ్వాస బిగబట్టి ఉంచగలిగితే కరోనా రానట్టేనా? 
శ్వాసకు సంబంధించిన వ్యాయామాలను బట్టి కరోనా వచ్చిందో లేదో నిర్ధారణ కాదు. కరోనా లక్షణాలున్నప్పటికీ 10 సెకండ్లు శ్వాస బిగబట్టగలిగితే వైరస్‌ లేనట్టేనని వస్తోన్న వార్తల్లో నిజం లేదు. కేవలం ల్యాబ్‌ పరీక్షల ద్వారా మాత్రమే కరోనా ఉందో లేదో నిర్ధారణ అవుతుంది. 

బూట్ల ద్వారా కరోనా వస్తుందా? 
బూట్ల ద్వారా కరోనా వైరస్‌ సంక్రమించే అవకాశం చాలా తక్కువ. కానీ చిన్నపిల్లలు ఇంట్లో నేల మీద ఆడుకునే అవకాశం ఉంది కాబట్టి బూట్లను ఇంటి ముందే వదిలేయడం మంచిది. బూట్ల లోపల ఉండే క్రిములకు సాధ్యమయినంత దూరంగా ఉండడమే మేలు.  

పసుపు తింటే కరోనా రాదా? 
పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆహార పదార్థాల్లో పసుపును కలిపేది అందుకే. అయితే, పసుపు ఎక్కువగా తిన్నంత మాత్రాన కరోనా రాదనడం వాస్తవం కాదు.

థర్మల్‌ స్కానర్లు కోవిడ్‌ నిగ్గు తేలుస్తాయా?
వాస్తవానికి థర్మల్‌ స్కానర్ల ద్వారా కోవిడ్‌ ఉందో లేదో నిర్ధారణ కాదు. కేవలం శరీరం ఉష్ణోగ్రత ఎంత ఉందనేది తెలుస్తుంది. కరోనా సోకినవారిలో శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.. కాబట్టి ఎక్కువ బాడీ టెంపరేచర్‌ ఉన్న వారిని గుర్తించేందుకు థర్మల్‌ స్కానర్లు వాడుతారు.  

ఫలానా వయసున్న వారికే కరోనా వస్తుందనేది ఏమైనా ఉందా? 
కరోనా సోకడానికి, వయసుకు ఏమాత్రం సంబంధం లేదు. అన్ని వయసుల వారికి వారు తీసుకునే జాగ్రత్తల ఆధారంగానే కరోనా వస్తుందా రాదా అనేది ఆధారపడి ఉంటుంది. ఏ వయసు వారైనా భౌతిక దూరం పాటించడంతో పాటు ఎప్పటికప్పుడు చేతులు, ముఖాన్ని శుభ్రపరచుకోవడం, కచ్చితంగా మాస్కు ధరించడమే ముఖ్యం.  

25 డిగ్రీల కన్నా ఎక్కువ ఎండ వల్ల వైరస్‌ సోకదా? 
కోవిడ్‌ సోకడానికి వాతావరణంతో సంబంధం లేదు. అధిక ఉష్ణోగ్రత ఉండే దేశాల్లో కూడా కరోనా కేసులు వస్తున్నాయి. సూర్యరశ్మిపై ఆధారపడడం కన్నా ఎప్పటికప్పుడు చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవడమే మంచిది.  

 చదవండి: ఉదయం పెసరట్టు.. లంచ్‌లో బ్రౌన్‌ రైస్‌.. రాత్రికి రాగిముద్ద!
కరోనా: గుడ్లు, చికెన్, చేపలు తినాలి .. శాకాహారులైతే
కరోనా: ఏది నిజం.. ఏది అబద్ధం.. కేంద్రం వివరణ

మరిన్ని వార్తలు