హైదరాబాద్‌ సీపీ రేసులో నలుగురి పేర్లు

13 Oct, 2023 13:09 IST|Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో సీపీ కోసం నలుగురి పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది. సీపీ రేసులో సందీప్ శాండిల్యా, వీవీ శ్రీనివాస్, కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, శివధర్‌రెడ్డిలతో కూడిన జాబితాను సీఈసికి సర్కార్ పంపించింది. 17 మంది అడిషనల్ డీజీల పేర్లను కూడా ప్రభుత్వం సీఈసికి ప్రభుత్వం సూచించింది. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రానున్న ఆదేశాలు రానున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పలువురు ఏపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. నలుగురు కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, కమిషనర్లను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, వరంగల్‌ సీపీ రంగానాథ్‌, నిజామాబాద్‌ సీపీ సత్యనారాయణ, ఖమ్మం సీపీ విష్ణు వారియర్‌ బదిలీ అయ్యారు. అదే విధంగా రంగారెడ్డి కలెక్టర్‌ హరీష్‌,  మేడ్చల్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, యాదాద్రి కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, నిర్మల్‌ కలెక్టర్ల వరుణ్‌ రెడ్డిలు ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు.  బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ వారు ఉన్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ధనబలాన్ని దుర్వినియోగం చేసినట్లు పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇదీ చదవండి: ఈసీ ఆదేశం.. తెలంగాణలో పలువురు ఎస్పీలు, కలెక్టర్ల బదిలీ

మరిన్ని వార్తలు