కరోనాతో భార్యాభర్తలు మృతి.. మరో ఆరుగురికి..

14 Aug, 2020 10:35 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. పంచముఖ హనుమాన్‌ కాలనీలో వారం రోజుల వ్యవధిలో భార్యాభర్తలు కరోనా బారినపడి మృతి చెందారు. కరోనా లక్షణాలతో హోం క్వారంటెన్‌లో ఉన్న రాజేష్(35) అనే యువకుడు బాత్ రూమ్‌లో జారిపడి ఈ నెల 7న మృతి చెందాడు. కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని భార్య గురువారం మృతి చెందింది. మరో వైపు మృతుడి కుమార్తె, తల్లిదండ్రులకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది.

అంతేకాకుండా మృతుడి అంత్యక్రియలకు హాజరైన 6 మందికి కరోనా సోకినట్లు వైద్యపరీక్షల్లో వెల్లడైంది. దీంతో రాజేష్ అంత్యక్రియలకు హాజరైన బంధువులు, స్నేహితుల్లో ఆందోళన మొదలైంది. కాగా. అంత్యక్రియలకు హాజరైన వారికి  వైద్య సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు. అయితే కామారెడ్డిలో గతంలో కూడా ఓ వ్యాపారి ఇచ్చిన విందు ద్వారా ఐదుగురికి కరోనా సోకిన సంగతి తెలిసిందే.  (కరోనా: తెలంగాణ హెల్త్‌ బులెటిన్‌)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు