గచ్చిబౌలి: పబ్‌లో మైనర్లతో పార్టీ నిర్వహణ.. బడా నేత ప్రమేయం!

27 Jun, 2022 10:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నా.. విమర్శలు వెల్లువెత్తుతున్నా.. హైదరాబాద్‌లో పబ్‌ల తీరు మారడం లేదు. తాజాగా.. జూహ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ తరహాలో ఓ పబ్‌లో మైనర్ల పార్టీ నిర్వహించారు. 

గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో రెండ్రోజుల పాటు మైనర్ల పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. సైబర్‌ హవర్స్‌ వాల్యూమ్‌-11 పేరుతో ఈవెంట్‌ను నిర్వహించారు.  మైనర్ల పార్టీకి ఎక్సైజ్‌ శాఖ అనుమతి నిరాకరించింది. 

అయితే ఒక బడా నేత ప్రమేయంతో మైనర్ల పార్టీ ఎరేంజ్‌ చేసినట్లు సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మైనర్ల పార్టీకి కొందరు ఆహ్వానాలు పంపించారు. ఇక నిర్వాహకులేమో పబ్‌లో మద్యం సరఫరా చేయలేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు