పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌గా మంజువాణి 

20 Feb, 2024 01:28 IST|Sakshi

ప్రస్తుత డైరెక్టర్‌ రాంచందర్‌ బదిలీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌గా డాక్టర్‌ జి.మంజువాణి నియమితులయ్యారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ ఎస్‌.రాంచందర్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం, ఆయన స్థానంలో మంజువాణిని నియమించింది. ఈ మేరకు పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌ సిన్హా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం మంజువాణి తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతారు. డాక్టర్‌ ఎస్‌.రాంచందర్‌ను తెలంగాణ 
పశుగణాభివృద్ధి సంస్థ (టీఎల్‌ఎస్‌డీఏ) సీఈవోగా నియమించారు.  

కాగ్‌ నివేదిక నేపథ్యంలో! 
పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గొర్రెల పంపిణీలో జరిగిన కుంభకోణం కారణంగానే ఈ బదిలీలు జరిగాయనే చర్చ సాగుతోంది. గొర్రెల పంపిణీలో చాలా అవకతవకలు జరిగాయని, బైక్‌లపై కూడా గొర్రెలను తీసుకొచ్చారని ఇటీవల కాగ్‌ తన నివేదికలో వెల్లడించిన నేపథ్యంలో ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.  

గిరిజన బిడ్డ కావడమే నేరమా?: 
ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పశుసంవర్థక శాఖలో జరిగిన బదిలీలపై రాష్ట్ర బహుజన సమాజ్‌పార్టీ అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ స్పందించారు. నిజాయితీకి మారుపేరైన రాంచందర్‌ను ఆగమేఘాల మీద బదిలీ చేసి బలిపశువును చేశారని, ఆయన తెలంగాణ తండాలలో జని్మంచిన గిరిజన బిడ్డ కావడమే నేరమా అని ఆయన ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. ‘గొర్రెల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రులను, వారి ఓఎస్డీలను, అప్పటి డైరెక్టర్లను ముట్టుకునే దమ్ముందా మీకు? ’అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

whatsapp channel

మరిన్ని వార్తలు