'రాష్ట్రంలో రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదు'

12 May, 2021 21:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో బుధవారం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కరోనా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి  సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరైనారు. సమావేశంలో ముఖ్యాంశాలుగా..మందుల నిల్వ, పంపిణీపై చర్చించామని కేటీఆర్‌ అన్నారు. వీటితో పాటు ఆక్సిజన్‌ కొరత రాకుండా ఉండాలని ప్రతీరోజు ఆక్సిజన్ వాడకంపై ఆడిట్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సరిపడ రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఉన్నట్లు ఆయన తెలిపారు.

కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న హోం ఇసోలేషన్ మందుల నిల్వలో ఎలాంటి కొరత లేద‌న్నారు. ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ఇంటింటికి సర్వే చేస్తూ అవసరం అయిన వారికి మెడికల్ కిట్స్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి అయిందన్నారు. ఇప్పటి దాకా 2.1 లక్షల కిట్స్ అంద‌జేసిన‌ట్లు తెలిపారు.  రానున్న రెండు వారాలు కరోనా కట్టడికి చాలా కీలకమని, ప్రజలు తప్పక నివారణ చర్యలను పాటించాలని సూచించారు.

రెమిడెసివర్‌కు మార్కెట్‌ విపరీతంగా ఉండంతో పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో అవసరం లేకున్నా రెమిడెసివిర్ వాడుతున్నారని మాకు  సమాచారం వచ్చింది. వీటిని త్వరలోనే అరికడతామని ఆయన అన్నారు. కరోనా కట్టడిపై తీసుకుంటున్న చర్యలు కేంద్రానికి వివరించినట్లు కేటీఆర్‌ తెలిపారు. క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో  ప్ర‌భుత్వం రాష్ట్రంలో బెడ్స్‌ను భారీగా పెంచిన‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రెమ్‌డెసివిర్ లాంటి మందుల నిల్వలు కూడా ఉన్న‌ట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.5 ల‌క్ష‌ల ఇంజెక్షన్లు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. బ్లాక్ ఫంగస్ అంశంలో కూడా ప్రభుత్వం అప్ర‌మ‌త్తంగా ఉంద‌న్నారు.

దీనికి అవసరమైన మందులను ప్రభుత్వం సేక‌రిస్తుందన్నారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్లు, మందుల సేకరణ, సరఫరాను సమన్వయం చేయడానికి ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ తొలి స‌మావేశం మంత్ర కేటీఆర్ అధ్య‌క్ష‌త‌న బుధ‌వారం జ‌రిగింది. సీఎస్ సోమేశ్ కుమార్‌, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జ‌యేశ్ రంజ‌న్‌, వికాస్ రాజ్‌, పంచాయ‌తీరాజ్ సెక్ర‌ట‌రీ సందీప్ సుల్తానియా, సీఎం స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ రాజేశేఖ‌ర్ రెడ్డి, లైఫ్‌సైన్సెస్ అండ్ ఫార్మా డైరెక్ట‌ర్ శ‌క్తి నాగ‌ప్ప‌న్ భేటీలో పాల్గొన్నారు.

( చదవండి: ‘కోవిడ్ మరణాలు , కేసులను ప్రభుత్వం తగ్గించి చూపిస్తోంది’ )

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు