సాయిబాబా అడిగినవి ఇవ్వండి

21 Oct, 2020 03:59 IST|Sakshi

ఆయనకు అవసరమైన మందులు, పుస్తకాలు, లేఖలు వెంటనే అందజేయండి

నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలు అధికారులకు ప్రొ. హరగోపాల్‌ విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: భీమా–కోరెగావ్‌ ఘటనలో ప్రమే యముందన్న ఆరోపణలపై నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ అధ్యాపకుడు, 90 శాతం వైకల్యంతో బాధపడుతున్న డాక్టర్‌.జి.ఎన్‌. సాయిబాబాకు అవస రమైన మందులు, పుస్తకాలు, ఉత్తరాలు వెంటనే అందజేయాలని జైలు అధికారులకు పౌరహక్కుల నేత, ‘కమిటీ ఫర్‌ ద డిఫెన్స్, రిలీజ్‌ ఆఫ్‌ జీఎన్‌ సాయిబాబా’ కన్వీనర్‌ ప్రొ.జి. హరగోపాల్‌ విజ్ఞప్తి చేశారు. మందులు, లేఖలు, అధ్యయనానికి అవసరమైన మెటీరియల్‌ ఇవ్వడం వంటి ప్రతీ ఖైదీకి అందాల్సిన మౌలిక హక్కులను కల్పించాలనే డిమాండ్‌తో బుధవారం నుంచి నిరాహార దీక్షకు దిగనున్నట్లు సాయిబాబా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కోరుతున్న వాటిని అందజేయాలని మంగళవారం ఓ ప్రకటనలో ప్రొ.జి.హరగోపాల్‌ విన్నవించారు.

సాయిబాబా ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని, కరోనా సోకే ప్రమాదమూ ఉన్నందున ఆయన్ను అనవసర ఆంక్షలతో వేధించవద్దని కోరారు. ఇప్పటికే కోవిడ్‌ కారణంగా సాయిబాబాను కుటుంబసభ్యులు, న్యాయవాదులు కలు సుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. అందువల్ల ఆప్తులు, మిత్రుల లేఖలు అందజేయడంతో పాటు, ఆయన కోరిన పుస్తకాలూ ఇవ్వాలని పేర్కొ న్నారు. న్యాయవాది ఇచ్చిన మందులు, పుస్తకాలు కూడా సాయిబాబాకు చేరనివ్వకపోవడం శోచనీయమన్నారు. గతంలో మాతృమూర్తి అంత్యక్రియలకూ అనుమతినివ్వకపోవడం, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ పెరోల్‌/మెడికల్‌ బెయిల్‌ ఇవ్వకపో వడంతో ప్రస్తుతం కరోనా కారణంగా ఆయన ప్రాణానికి ప్రమాదం ఏర్పడిం దన్నారు. ఈ విషయంపై ప్రజాస్వామ్య వాదులు, సంస్థలు స్పందించి నాగ్‌పూర్‌ జైలు అధికారులకు విజ్ఞప్తులు పంపడం ద్వారా సాయిబాబా హక్కులు కోల్పోకుండా చూడాలని కోరారు. దీనిపై ఇప్పటికే మహారాష్ట్ర అదనపు డైరెక్టర్‌ జనరల్‌ (జైళ్లు)కు ఈ నెల 15న సాయిబాబా భార్య వసంతకుమారి వినతిపత్రం పంపించారని హరగోపాల్‌ తెలిపారు. ఈ విషయంలో వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సాయిబాబా నిరాహార దీక్షకు దిగకుండా ఆయన అడిగినవి ఇవ్వాలని కోరారు.   

మరిన్ని వార్తలు