TSRTC New 80 Buses: రోడ్డెక్కనున్న కొత్త బస్సులు

30 Dec, 2023 02:50 IST|Sakshi

 అంబేడ్కర్‌ విగ్రహం వద్ద  నేడు ప్రారంభించనున్న మంత్రి పొన్నం

సాక్షి,హైదరాబాద్‌ : ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ పెరిగిన నేపథ్యంలో ప్రభు­త్వం కొత్తగా బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్‌ కమ్‌ సీటర్‌(నాన్‌ ఏసీ) బస్సులను హైదరాబాద్‌ ఎన్‌టీఆర్‌ మార్గ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శనివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నంప్రభాకర్‌ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమా­­నికి రవాణా, రహదారి, భవ­నాల­శాఖ కార్యదర్శి  శ్రీనివాసరాజు, రవాణా­శాఖ కమిష­నర్‌ జ్యోతి బుద్దా ప్రకాశ్‌తోపాటు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తదితరులు హాజరవుతారు. 

రూ. 400 కోట్లతో 1,050 కొత్త బస్సులు
ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైనసేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరంతరం కృషి చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1,050 కొత్త డీజిల్‌ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరి స్లీపర్‌ కమ్‌ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు న్నాయి. వీటికి తోడు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ వాహనాలను హైదరాబాద్‌ సిటీలో 540, జిల్లాల్లో 500 బస్సులను కూడా అందుబాటులోకి తేనుంది. ఇవన్నీ విడతల వారీగా  వచ్చే మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సంస్థ ప్లాన్‌ చేసింది.  

>
మరిన్ని వార్తలు