సాగు పరిశోధనలో అమెరికా సహకారం కావాలి.. మంత్రి నిరంజన్‌ రెడ్డి

1 Sep, 2023 03:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పరిశోధన రంగంలో అమెరికా సహకారం ఆశిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నదే  తమ ఆకాంక్ష అన్నారు. 

అమెరికా పర్యటనలో ఉన్న నిరంజన్‌ రెడ్డి బృందం మూడో రోజు గురువారం వాషింగ్టన్‌ డీసీలో వ్యవసాయ శాఖ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఐటీ, ఫార్మ్‌ ఎకనామిక్స్, సీడ్‌ టెక్నాలజీ, పోస్ట్‌ హార్వెస్ట్‌ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్‌ తదితర రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలపై చర్చించింది.  వాషింగ్టన్‌ డీసీలో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ను సందర్శించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు పథకం ప్రారంభించి రైతులకు పంట పెట్టుబడి ఇస్తున్నామన్నారు. ఎన్‌ఐఎఫ్‌ఏ డైరెక్టర్‌ మంజిత్‌ మిశ్రా మాట్లాడుతూ వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన చాలా ముఖ్యమన్నారు. కానీ ఆ పరిశోధనను అర్థవంతమైన ఫలితాలుగా మార్చడంలో రాజకీయ నాయకుల పాత్ర చాలా కీలకమని చెప్పారు. 

నిరంజన్‌ రెడ్డి వెంట వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, తెలంగాణ డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ ఉన్నారు.  

ఇది కూడా చదవండి: వీవోఏల గౌరవ వేతనం రూ.8 వేలకు పెంపు 

మరిన్ని వార్తలు