ముంబైలో కుబేర | Sakshi
Sakshi News home page

ముంబైలో కుబేర

Published Thu, Apr 25 2024 3:49 PM

New schedule of Dhanush Kubera kicks off in Mumbai - Sakshi

ధనుష్, నాగార్జున లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘కుబేర’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల బ్యాంకాక్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది.

కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ షూటింగ్‌ ముంబైలోప్రారంభం అయింది. దాదాపు రెండు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట శేఖర్‌ కమ్ముల. సోనాలి నారంగ్‌ సమర్పణలో సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్  రావు నిర్మిస్తున్న ‘కుబేర’ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement