సైబర్‌ నేరాలపై ఖాతాదారులకు అవగాహన | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై ఖాతాదారులకు అవగాహన

Published Sun, Apr 7 2024 1:40 AM

అవగాహన కల్పిస్తున్న పోలీసులు - Sakshi

ఇందల్వాయి: మండల కేంద్రంలోని యూనియన్‌ బ్యాంకులో ఖాతాదారులకు సీపీ కల్మేష్‌ ఆదేశాల మేరకు సైబర్‌ నేరాలపై పోలీసు సిబ్బంది శనివారం అవగాహన కల్పించారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నేపథ్యంలో ధాన్యం డబ్బులు వేస్తామని ఓటీపీ చెప్పాలని సైబర్‌ నేరగాళ్లు ఫేక్‌ ఫోన్‌ కాల్స్‌ చేసే అవకాశం ఉందని, అలాంటి అపరిచిత ఫోన్‌కాల్స్‌కి స్పందించవద్దని సూచించారు. వ్యక్తిగత బ్యాంకు వివరాలు, ఏటీఎమ్‌ వివరాలు అపరిచిత వ్యక్తులతో పంచుకోవద్దన్నారు. వాట్సప్‌లో, మెసేజ్‌ రూపంలో వచ్చే అనవసరపు లింకులను క్లిక్‌ చేయవద్దని అన్నారు. సైబర్‌ నేరాలకు గురైతే వెంటనే 1930 నెంబరుకి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌, పోలీస్‌ సిబ్బంది నవీన్‌, ప్రకాష్‌ నాయక్‌, రఘు, కిషన్‌ ఉన్నారు.

నూతన చట్టాలపై పోలీసులకు..

ఖలీల్‌వాడి: తెలంగాణ రాష్ట్ర ప్రాసిక్యూటర్‌ జి.వైజయంతి, ఉమ్మడి జిల్లాల ప్రాసిక్యూషన్‌ పి.లక్ష్మీనర్సయ్య ఆదేశాల మేరకు నూతన చట్టాలపై పోలీసులకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజేష్‌గౌడ్‌ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శనివారం జిల్లా కోర్టులోని సమావేశ మందిరంలో ఆయన మాట్లాడారు. భారతీయ న్యాయ సంహిత్‌–2023, భారతీయ నాగరిక సురక్షా సంహిత్‌–2023, భారతీయ సాక్ష అధినియం–2023లపై పోలీసులకు వివరించారు. కార్యక్రమంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు రవిరాజ్‌, బంటు వసంత్‌, రాజారెడ్డి, నిజామాబాద్‌ డివిజన్‌కు చెందిన పోలీసు అధికారులు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement