మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చాం: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చాం: సీఎం జగన్‌

Published Tue, May 7 2024 6:34 PM

YS Jagan_Gajuwaka

విశాఖపట్నం, సాక్షి: అబద్ధాలకు రెక్కలుకట్టి గతంలో మేనిఫెస్టోలు ఇచ్చేవారని, తాము మాత్రం మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకువచ్చామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత గాజువాకలో మంగళవారం(మే7) జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. మీటింగ్‌కు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల కాలంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించారు. 

‘మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలివి. గతంలో ఎప్పుడూ ఎవరూ బటన్‌ నొక్కలేదు. నేరుగా అక్క చెల్లెల్లకు డబ్బులిచ్చిందీ లేదు. 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి స్కీమ్‌ కూడా పేదలకు గుర్తుకు రాదు. 59 నెలల్లో 2లక్షల31 వేల ఉద్యోగాలిచ్చాం. 59 నెలల్లోనే అనూహ్య మార్పులు తీసుకువచ్చాం. 13 జిల్లాలను 26 జిల్లాలు చేశాం. ఇది అభివృద్ధి కాదా. 59 నెలల పాలనలో 17 మెడికల్‌ కాలేజీలు అభివృద్ధి కాదా.

ఒక్క ఉత్తరాంధ్రకే నాలుగు మెడికల్‌ కాలేజీలు వచ్చాయి. వైస్‌ఆర్‌సీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయి. దశాబ్దాల నాటి ఉద్దానం సమస్యను పరిష్కరించాం. మూడు వేల గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీలు నిర్మాణంలో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో 400 సెల్‌టవర్లు పెట్టాం. భోగాపురం ఎయిర్‌పోర్టు శరవేగంగా పూర్తవుతుండడానికి కారణం ఎవరు. కుల,మత ప్రాంతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నాం. ఇంటి వద్దకే పెన్షన్‌, రేషన్‌ సౌకర్యం కల్పిస్తున్నాం. 

నాడు-నేడు ద్వారా బడులకు కొత్త రూపం తీసుకువచ్చాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం, 6వ తరగతి నుంచే డిజిటల్‌ బోధన తీసుకువచ్చాం. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీని నెంబర్‌వన్‌గా నిలిపాం. బాబు హయాంలో కంటే ఎక్కువగా మీ బిడ్డ హయాంలో లక్ష కోట్లపైబడి పెట్టుబడులు వచ్చాయి’ అని సీఎం జగన్‌ వివరించారు. 

సీఎం జగన్‌ ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలు

  • విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా చేస్తా.. జూన్‌ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది విశాఖ నుంచే పాలన కొనసాగించేది విశాఖ నుంచే

  • ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి

  • లంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్ది

  • సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ అంటే ఇది కాదా అని అడుగుతున్నా


రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారు

  • ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి
  • వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళ వారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా
  • బాబు, దత్తపుత్రుడు, మోదీగారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి
  • ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్‌ ప్లాంట్‌ ప్రేవేట్‌ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండి
  • మీ జగన్‌ ఆమోదం లేదు కాబట్టే స్టీల్‌ ప్లాంట్‌ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్‌ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు

గాజువాకలో కూటమికి ఓటేస్తే స్టీప్లాంట్‌ అమ్మేయమన్నట్లే

  • గాజువాకలో మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయడం అంటే స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్లు అవుతుంది
  • ఇక్కడ టీడీపీ, ఎన్‌డీఏ గెలిచిందంటే స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ఆపడం సాధ్యం కాదు ఎందుకంటే దీన్నే వారు ఎన్నికల రెఫరెండంగా తీసుకుంటారు
  • ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి, తర్వాత జగన్‌ ఎంత ప్రయత్నించినా నీకెందుకయ్యా వారు స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి అనకూలంగా తీర్పు ఇచ్చారంటారు
  • ఈ ఎన్నికల్లో స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్‌కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్‌ ఇక్కడి నుంచి పంపండి 

 

Advertisement
Advertisement