చూస్తూ ఊరుకోం.. యుద్ధం చేస్తాం: కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

చూస్తూ ఊరుకోం.. యుద్ధం చేస్తాం: కేసీఆర్‌

Published Fri, Apr 26 2024 8:53 PM

kcr

సాక్షి,మహబూబ్‌నగర్‌: పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వమని బతిమాలినా ప్రధాని పట్టించుకోలేదని అందుకు బీజేపీకి ఓటు వేయాలా అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో శుక్రవారం(ఏప్రిల్‌26) జరిగిన బస్సు యాత్ర రోడ్‌షోలో కేసీఆర్‌ మాట్లాడారు. కేెంద్రం నల్ల చట్టాలు తెచ్చి రైతులను మోసం చేసిందని విమర్శించారు. 

‘కొత్త రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల బీజేపీ ఇవ్వలేదు. మోటర్లకు మీటర్లు పెట్టాలని మోదీ చెప్పినా నేను అంగీకరించలేదు. బడేబాయ్..మోడీ..చోటా భాయ్ రేవంత్ రెడ్డికి ఓటు వేసినా వేస్ట్.  రైతుల మోటార్లకు మీటర్లు కచ్చితంగా పెడతారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు ఇవ్వడం లేదు. 

తెచ్చిన తెలంగాణ కళ్లముందే నాశనం అయితుంటే చూసి ఊర్కోం. యుద్ధం చేస్తాం. బీజేపీ, కాంగ్రెస్‌ రెండు ఏకమై ప్రాంతీయపార్టీలను దెబ్బతీయాలని చూస్తున్నాయి.దేవుని పేరు చెప్పి ఒకరు..దేవుని మీద ఒట్టు పెట్టి ఒకరు ఓటు అడుగుతున్నారు. రాష్ట్రంలో రైతుబందు,రైతుబీమా ఉంటుందో లేదో తెలియని అయోమయ పరిస్దితి నెలకొంది. అందరం ఏకమై ప్రభుత్వం మెడలు వంచాలి’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 

Advertisement
Advertisement