ఏపీ బీజేపీ లిస్ట్‌.. ఇవి గెలిచే మొహాలేనా? | Sakshi
Sakshi News home page

ఏపీ బీజేపీ లిస్ట్‌.. ఇవి గెలిచే మొహాలేనా?

Published Wed, Mar 27 2024 8:37 PM

Satirical Comment On AP BJP Assembly Candidate List - Sakshi

కాపులకు మొండి చెయ్యి... 

పురంధేశ్వరి ద్వారా బీజేపీకి బాబు వెన్ను పోటు

అనుకున్నదే జరిగింది.. చంద్రబాబు మళ్ళీ తన సహజ బుద్ధిని బయటపెట్టుకున్నారు.. కాళ్ళా వెళ్ళా పడి బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీకి వెన్నుపోటు పొడిచారు. పాలు పోసి పించినా పాము విషాన్నే కక్కుతుందని మరోమారు రుజువైంది. తెలుగుదేశం, జనసేన.. బీజేపీల కూటమి గుంజాటన.. తన్నులాటల నడుమ బీజేపీ తన పదిమంది అభ్యర్థులను ప్రకటించింది.

అయితే ఈ జాబితా చూస్తుంటే చంద్రబాబు కనుసన్నల్లోనుంచి.. ఆలోచనల్లోంచి వచ్చిన పేర్లను మాత్రమే అభ్యర్థులుగా ప్రకటించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆ జాబితాలో మొదటినుంచి పార్టీకోసం పని చేస్తున్న వాళ్ళు ఎవరూ లేకుండా చంద్రబాబు కుట్రపన్నినట్లు అర్థం అవుతోంది. సీనియర్ నాయకుడు పీవీఎన్ మాధవ్ కానీ... విష్ణువర్థన్ రెడ్డి... సోము వీర్రాజు వంటి వాళ్ళు ఎవరూ జాబితాలో లేకుండా చంద్రబాబు జాగ్రత్తపడ్డారు.

తన బంధువు, వదిన, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ద్వారా చక్రం తిప్పి తాను అనుకున్నవాళ్లకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చారు. జాబితాలో ముగ్గురు కమ్మ సామాజికవర్గానికి చెందినవావాళ్లకు టిక్కెట్ ఇచ్చిన పురంధేశ్వరి ఒక్కరంటే ఒక్కరు కాపులకు కూడా టిక్కెట్ ఇవ్వలేదు. గట్టిగానొరు విప్పుతారు అని పేరొందిన సోము వీర్రాజుకు టిక్కెట్ ఇవ్వకపోవడం కూడా పెద్ద కుట్ర అని బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ క్యాడర్ ఆవేదన చెందుతోంది. పోన్లే కదాని పొత్తు కు ఒప్పుకుంటే ఇలాగేనా వెన్నుపోటు పొడుస్తారు అని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. 

2014లో కైకలూరులో గెలిచి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కామినేని గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తరువాత ఈ ఐదేళ్ళలో ఏనాడూ నియోజకవర్గానికి వెళ్ళలేదు. ప్రజలు, క్యాడర్‌ను పట్టించుకోలేదు. కానీ సరిగ్గా ఐదేళ్ల తరువాత ఎన్నికలు రాగానే మళ్ళీ కామినేని శ్రీనివాస్ దిగిపోయారు. ఠక్కున టిక్కెట్ ఎగరేసుకుపోయారు.  ఇది పురంధేశ్వరి ద్వారా చంద్రబాబు పన్నిన కుట్ర అని స్పష్టమవుతోంది. ఆశ్చర్యంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల టిక్కెట్ కూడా బీజేపీకి ఇచ్చారు. అక్కడ వాస్తవానికి తూర్పు కాపు ఓటర్లు ఎక్కువ.. కానీ అక్కడ కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన ఈశ్వర రావుకు టికెట్ ఇచ్చారు.

దానికితోడు బీజేపీలో టిక్కెట్లకోసం పురంధేశ్వరి డబ్బులు కూడా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మొత్తానికి తిమ్మిని బమ్మిని చేస్తూ బిజెపిని సైతం విజయవంతంగా ముంచేసి తన  రాజకీయం పవరేమిటన్నది చంద్రబాబు మరోమారు రుచి చూపించారు. ఈ జాబితా చూస్తుంటే అలసివి గెలిచే మొహాలేనా.. చంద్రబాబు మొత్తం మన పార్టీని గొర్రెలను చేసేసాడు కదా అని హార్డ్ కొర్ బీజేపీ క్యాడర్ ఆవేదన చెందుతున్నా.. చేసేదేమి లేక సైలెంట్ గా లోలోన బాధపడుతోంది. 

 బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు..
1)ఎచ్చెర్ల – ఎన్ ఈశ్వర రావు(కమ్మ )
2)విశాఖపట్నం నార్త్ – విష్ణు కుమార్ రాజు
3)అరకు లోయ – పంగి రాజారావు
4)అనపర్తి – ఎం.శివ కృష్ణం రాజు
5)కైకలూరు – కామినేని శ్రీనివాసరావు(కమ్మ )
6)విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి (కమ్మ )
7)బద్వేల్ – బొజ్జా రోశన్న
8)జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి
9)ఆదోని – పార్థసారథి
10)ధర్మవరం – వై.సత్యకుమార్

-/// సిమ్మాదిరప్పన్న ///

Advertisement
Advertisement