డబుల్‌ ధమాకా

Published on Fri, 05/10/2024 - 04:32

హీరో విజయ్‌ దేవరకొండ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. గురువారం (మే 9) తన బర్త్‌ డే సందర్భంగా మరో రెండు కొత్త చిత్రాల అప్‌డేట్స్‌తో అభిమానులకు డబుల్‌ ధమాకా ఇచ్చారు విజయ్‌ దేవరకొండ. వాటిలో ఓ చిత్రానికి ‘రాజావారు రాణిగారు’ మూవీ ఫేమ్‌ రవికిరణ్‌ కోలా దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై (ఎస్వీసీ) ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించనున్నారు.

 విజయ్‌ హీరోగా ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ‘ది ఫ్యామిలీ స్టార్‌’ ఏప్రిల్‌ 5న విడుదలైంది. మరోసారి విజయ్‌ హీరోగా ఎస్వీసీ సంస్థ తన 59వ చిత్రాన్ని ప్రకటించింది. ఈ సినిమా ప్రకటన సందర్భంగా రిలీజ్‌ చేసినపోస్టర్‌లో విజయ్‌ కత్తి పట్టుకుని, వయొలెంట్‌ మోడ్‌లో ఉన్నారు. ‘కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే..’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. ‘‘రూరల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంతో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందనున్న ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

మైత్రీతో మూడోసారి... ‘డియర్‌ కామ్రేడ్, ఖుషి’ వంటి సక్సెస్‌ఫుల్‌ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో మూడో సినిమా ‘వీడీ 14’ (వర్కింగ్‌ టైటిల్‌) ప్రకటన వచ్చింది. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించనున్నారు.

‘టాక్సీవాలా’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రం తర్వాత విజయ్‌ దేవరకొండ, డైరెక్టర్‌ రాహుల్‌ సంకృత్యాన్‌ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందనుంది. ‘‘పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ‘వీడీ 14’ తెరకెక్కనుంది. 19వ శతాబ్దం నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నాం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు మేకర్స్‌.

Videos

విజయం మనదే.. మహిళలకు పెద్దపీట..

ఏపీలో పనిచేయని NDA హవా.. షర్మిలకు డిపాజిట్ గల్లంతు

గెలుపు ఎవరిదో తేలిపోయింది..

బీజేపీకి పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్..

ఏపీలో వైఎస్ఆర్ సీపీదే విజయం..

జగన్ అనే నేను..

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు..

నో డౌట్ పక్కా సీఎం జగన్

వైఎస్ఆర్ సీపీ గెలుపు ధీమా..

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు..

Photos

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)

+5

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

+5

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)