టాలీవుడ్‌లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త

Published on Fri, 05/10/2024 - 13:07

తెలుగు సినిమాలపై స్టార్ హీరో సంయుక్త మేనన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక్కడ నటించాలంటే చాలా కష్టమని చెప్పింది. అలానే టాలీవుడ్‌లో తనకెదురైన కష్టాల్ని, అనుభవాల్ని బయటపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు చిత్రసీమపై తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసింది. అలానే మలయాళ ఇండస్ట్రీతో పోల్చి చూస్తే ఇక్కడ ఎలా ఉంటుందనేది కూడా చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?)

'మలయాళంతో పోలిస్తే తెలుగు సినిమాల్లో నటించడం చాలా కష్టం. భాష రాకపోవడమనేది ఓ కారణమైతే.. మేకప్ మరో రీజన్. వినడానికి సిల్లీగా ఉన్నాసరే నా వరకు ఇది చాలా పెద్ద విషయం. మలయాళ చిత్రాల్లో మేకప్ త్వరగా అయిపోతుంది. చాలా నేచురల్‌గా వేస్తారు. యాక్టింగ్ కూడా మనకు నచ్చినట్లు చేసేయొచ్చు. కానీ టాలీవుడ్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్క్రీన్‌పై ఎలా కనిపిస్తున్నామనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. దానికి తోడు ఎక్కువ మేకప్ వేస్తారు. చాలా చిరాగ్గా.. ముఖంపై ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది' అని సంయుక్త తన కష్టాల్ని చెప్పుకొచ్చింది.

2016లోనే నటిగా మారిన సంయుక్త మేనన్... తొలుత మలయాళ, తమిళ చిత్రాలు చేసింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. 'భీమ్లా నాయక్', 'బింబిసార', 'విరూపాక్ష', 'సర్' చిత్రాలతో వరస హిట్స్ కొట్టి గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. కానీ కల్యాణ్ రామ్ 'డెవిల్'తో ఫ్లాప్ అందుకుంది. ప్రస్తుతం నిఖిల్ 'స్వయంభు' మూవీతో పాటు శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ చేయబోయే కొత్త చిత్రాల్లో నటిస్తోంది. అలానే హిందీలోకి కూడా అడుగుపెట్టాలని ప్లాన్స్ చేసుకుంటోంది.

(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి పర్సనల్‌ వీడియో లీక్‌)

Videos

"మళ్ళీ జగనే" ఎలక్షన్ రిజల్ట్స్ పై పరిపూర్ణానంద స్వామి రియాక్షన్

నటి హేమ అరెస్ అదనపు కేసులు నమోదు

తాజ్ ఎక్స్ ప్రెస్ లో మంటలు దగ్ధమైన నాలుగు భోగీలు

కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

చంద్రబాబుకు పిక్చర్ అర్థం అయ్యింది..

చంద్రబాబుకు పిక్చర్ అర్థం అయ్యింది..

ఫ్లాష్ ఫ్లాష్ తెలంగాణ ఎలో అలెర్

పూర్తి ఆధారాలతో హేమను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కఠినమైన ఆంక్షల మధ్య కౌంటింగ్

ఎగ్జిట్ పోల్స్ పై కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు

Photos

+5

Keerthi Bhatt: కాబోయే భర్తతో సీరియల్‌ నటి కీర్తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

అనంత్‌- రాధిక ప్రీవెడ్డింగ్‌: ఇటలీలో ఎంజాయ్‌ చేస్తున్న ధోని ఫ్యామిలీ (ఫొటోలు)

+5

AP: కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌.. ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధం (ఫొటోలు)

+5

తెలంగాణ రాష్ట్ర గీతం పాడిన సింగర్‌ హారిక నారాయణ్‌ (ఫోటోలు)

+5

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (ఫొటోలు)

+5

త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)