amp pages | Sakshi

3 గంటల్లోనే ముగింపు

Published on Fri, 06/19/2015 - 02:17

రాజమండ్రి : నగరంలో గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జరిపిన పర్యటన.. అంతకు ముందు ఎంత హడావుడిగా ఖరారైందో అంతే హడావుడిగా జరిగింది.   ఒకవైపు వర్షం, మరోవైపు ఆయన రాక ఆలస్యం కావడంతో పర్యటన మూడు గంటల్లోపే ముగిసింది. రాక ఆలస్యం కావడంతో సీఎం పుష్కర పనుల పరిశీలన రద్దు కాగా, సరిగ్గా గంటం పావులో సమీక్షా సమావేశం ముగించి ఆయన విజయవాడ బయలుదేరారు.
 
 పుష్కర పనులు మందకొడిగా సాగుతున్నాయనే విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రాజమండ్రి పర్యటనకు వచ్చారు. నిర్ణీత కార్యక్రమం ప్రకారం ఆయన ఉదయం పది గంటలకు ప్రత్యేక విమానంలో మధురపూడి చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్‌లో పట్టిసీమ వెళ్లాల్సి ఉంది. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు మధురపూడి చేరుకుని అక్కడ నుంచి 1.30 గంటలకు కోటిలింగాల, పుష్కరఘాట్‌లను పరిశీలించాలి. అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సమీక్షా సమావేశంలో పాల్గొనాలి. అయితే బాబు విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో పట్టిసీమ వెళ్లి, అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు మధురపూడి చేరుకున్నారు.
 
 ఈ సమయంలో రాజమండ్రిలో భారీ వర్షం పడుతోంది. దీనితో ఘాట్‌ల పరిశీలన రద్దు చేసుకుని విమానాశ్రయం నుంచి 4.15 గంటలకు ఆర్‌అండ్‌బీ అతిథిగృహం చేరుకున్నారు. దారిలో రాజమండ్రి రూరల్ మండలం గాడాలలో మధురపూడి - రాజమండ్రి నాలుగులేన్ల రోడ్డులో నాటిన మొక్కలను పరిశీలించారు. ఆర్ అండ్ బీ అతిథిగృహంలో సుమారు 1.15 గంటల పాటు సమీక్షా సమావేశం నిర్వహించిన బాబు అక్కడి నుంచి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం 6.30 గంటలకు విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద రాజమండ్రికి చెందిన అర్చక సమాఖ్య నాయకులు ముఖ్యమంత్రిని కలిసి పుష్కరాల సమయంలో పిండప్రదాన, ఇతర కార్యక్రమాలకు ధరలు నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. తమకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞాపన పత్రం అందజేశారు.
 
 ఆద్యంతం గందరగోళం..
 ముఖ్యమంత్రి మధురపూడిలో దిగిన వెంటనే పుష్కరఘాట్ పరిశీలనకు వెళుతున్నట్టు చెప్పారు. తరువాత అది కాస్తా రద్దయింది. తర్వాత.. రాత్రికి ఆయన రాజమండ్రి ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో బస చేస్తారని, శుక్రవారం ఉదయం ఘాట్‌లను పరిశీలిస్తారనే సమాచారం వచ్చింది. తరువాత అది కూడా రద్దయినట్టు చెప్పారు. చివరకు సమీక్షా సమావేశం తరువాత మీడియాతో మాట్లాడతారని సమాచార శాఖాధికారులు చెప్పినప్పటికీ అది రద్దరుుంది. ‘ఓటుకు నోటు’ కేసు విషయాన్ని మీడియా లేవనెత్తుతోందనే అనుమానంతో బాబు మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నట్టు తెలిసింది. మొత్తం మీద బాబు జిల్లా పర్యటన 1.15 గంటల సమీక్షతో ముగిసిపోయింది. పర్యటనలో చంద్రబాబు ముభావంగా కనిపించారు. పార్టీ నేతలతో సైతం ఆయన పెద్దగా మనస్సు విప్పి మాట్లాడలేదని సమాచారం.
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)