amp pages | Sakshi

మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతులు

Published on Wed, 10/02/2013 - 06:49

 సిద్దిపేటటౌన్, న్యూస్‌లైన్: మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. మద్దతు ధర కోతలపై మండిపడ్డారు. మార్కెట్ ఎదుట రహదారిపై రాస్తారోకోకుదిగి వాహనాలను స్తంభింపజేశారు. చివరకు అధికారులు దిగివచ్చి రైతులకు న్యాయం చేసిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.  సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, కొండపాకలతోపాటు కరీంనగర్, వరంగల్ జిల్లాల సరిహద్దు గ్రామాల నుంచి 3,300 క్వింటాళ్ల మొక్కజొన్నలు అమ్మకానికి వచ్చాయి.
 
 మొక్కజొన్నలో 14 శాతానికి బదులుగా 16 శాతం తేమ ఉందని 9 ట్రాక్టర్ల మొక్కజొన్నను వాపస్ పంపారు. 9 వేలం ప్రాంతాల్లో మొక్కజొన్నలను విక్రయానికి సిద్ధం చేయగా ట్రేడర్లు సరిగా ముందుకు రాకపోవడంతో సాయంత్రం వరకు 7 ప్రాంతాల్లో మాత్రమే పంటను వేలం ద్వారా విక్రయించారు. కాగా ప్రభుత్వం క్వింటాలు మొక్కజొన్న మద్దతు ధర రూ.1310 ప్రకటించగా తేమ తదితర కారణాలు చూపి రూ.1,210కే కొనుగోలు చేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు మార్కెట్ ఎదురుగా ఉన్న కరీంనగర్ రోడ్డుపై రాస్తారోకోకు దిగారు.
 
 కరీంనగర్, సిద్దిపేట వైపు వెళ్లే అన్నిరకాల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ‘సీఎం డౌన్ డౌన్, మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వాలి, కలెక్టర్ ఇక్కడకు రావాలి’ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న కలెక్టర్  సిద్దిపేట తహశీల్దార్ యాదగిరిని సంఘటనా స్థలికి పంపారు. రైతులు, ట్రేడర్లు, మార్కెట్ అధికారులతో ఆయన చర్చలు జరిపారు. చివరికి రూ.1,210కి ఖరీదు చేసిన మొక్కజొన్నలకు అదనంగా మరో రూ.80 ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. అదే విధంగా ఖరీదు చేయని మొక్కజొన్న పంటను పూర్తిగా కొనుగోలు చేయడానికి ట్రేడర్స్ అంగీకరించడంతో రైతులు ఆందోళన విరమించారు.
 

Videos

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)