amp pages | Sakshi

అభివృద్ధి చేస్తే.. పదేళ్లు ప్రతిపక్షంలో ఎందుకుంటావ్ ?

Published on Tue, 01/21/2014 - 02:08

చంద్రబాబును కడిగేసిన అక్బరుద్దీన్
ప్రజల నమ్మకాన్ని కోల్పోయావు
భవిష్యత్తుపై చెప్పలేని ఆందోళన ఉంది
మీరు చెప్పేదొకటి, చేసేదొకటి
మిమ్మల్ని నమ్మే పరిస్థితే లేదు
స్పష్టమైన విధానమంటూ లేదు

 
 సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సోమవారం సభలో తీవ్రంగా తూర్పారబట్టారు. ‘‘అభివృద్ధి చేస్తే పదేళ్లుగా ప్రతిపక్షంలో ఎందుకుంటావు? భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఎందుకుంది? నువ్వు ప్రజల నమ్మకాన్ని కోల్పోయావు. నిన్ను నమ్మే పరిస్థితి లేదు. మీ వైఖరి చెప్పేదొకటి, చేసేది మరొకటి అన్నట్టుగా ఉంటుంది’’ అంటూ దుమ్మెత్తిపోశారు. తెలంగాణ బిల్లుపై జరుగుతున్న చర్చలో భాగంగా అక్బరుద్దీన్ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో 27 ఏళ్ల 5 నెలల పాటు రాయలసీమ ప్రాంతం వారే ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. అయినా రాయలసీమ అభివృద్ధి చెందలేదన్నారు. ఇప్పటికీ అనేక సమస్యలున్నాయంటూ సీమ నుంచి సీఎంలుగా పని చేసిన వారి జాబితాను చదివారు. అందులో చంద్రబాబును కూడా ప్రస్తావించారు. తనకు ఐదేళ్ల పాటు సమయమిస్తే రాయలసీమను అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.
 
 బాబు స్పందిస్తూ, హైదరాబాద్‌లో 400 ఏళ్ల కాలంలో నిజాం చేయని అభివృద్ధిని తాను 9 ఏళ్ల కాలంలోనే చేశానన్నారు. ‘హైటెక్ సిటీ కట్టాం. రోడ్లు వేశాం. సింగపూర్‌లా మార్చాం. అప్పట్లో ప్రతి ఆర్నెల్లకు ఒకసారి కర్ఫ్యూ ఉండేది’ అంటూ చెప్పుకొచ్చారు. బాబు వాదనను అక్బర్ తిప్పికొట్టారు. ‘‘మీరు అంత అభివృద్ధి చేస్తే రెండుసార్లు బ్యాలెట్‌కు ఎందుకు దూరమయ్యారు? మీ భవిష్యత్తెలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఎందుకుంది? గోధ్రా అల్లర్లు జరిగినప్పుడు ముస్లిం ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటానన్న మీరు బీజేపీ వైపు ఎందుకు వెళ్తున్నారు? ఎప్పుడూ మాటపై నిలబడరు. ఒకటి చెప్పి మరొకటి చేస్తారు. స్పష్టమైన విధానం లేకపోవడం వల్లే ప్రజలకు మీపై నమ్మకం పోయింది’’ అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. దాంతో టీడీపీ సభ్యులు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు.
 
 నిజాంపై పొగడ్తలు
 కాంగ్రెస్‌కు చెందిన చెన్నారెడ్డి హయాంలో హైదరాబాద్‌లో మత కల్లోలాలు జరిగితే, ఆ తర్వాత ఆ పార్టీకే ఎంఐఎం మద్దతిచ్చిందని టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు. అక్బర్ స్పందిస్తూ, హైదరాబాద్ అభివృద్ధికి నిజాం ఎంతో కృషి చేశారన్నారు. హైదరాబాద్ విలీనం కాకముందున్న విద్యా సంస్థలు, వైద్య సదుపాయాలు, రోడ్లు, విద్యుత్, పరిశ్రమలు, నీటిపారుదల సౌకర్యాల వంటి వివరాలను పేర్లతో సహా సభ ముందుం చారు. ‘‘నిజాం హయాంలోనే హైదరాబాద్‌లో ఆర్థికంగా మిగులుండేది. సొంత తపాలా, కరెన్సీ ఉండేవి. కిరణ్, అశోక్ గజపతిరాజు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వంటి వారు చదివిన హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్‌ను నిర్మించింది నిజామే.
 
 నిజాం ఏర్పాటు చేసిన స్కాలర్‌షిప్ వల్ల భారత కోకిల సరోజినీ నాయుడు వంటివారు లండన్‌లో చదువుకున్నారు. హుస్సేన్‌సాగర్ వద్ద నిజాం ఏర్పాటు చేసిన థర్మల్ విద్యుత్కేంద్రాన్ని ఎన్టీఆర్ ప్రభుత్వం అమ్ముకుంది. ఆఖరికి ఇప్పుడు మనమున్న అసెంబ్లీ భవనాన్ని కూడా నిజాం నిర్మించినదే’’ అని పేర్కొన్నారు. అందుకు మద్దతుగా టీఆర్‌ఎస్ సభ్యులు బల్లలు చరిచారు. ఈ సమయంలో మళ్లీ టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. నిజాంపై ఎంఐఎంకు ప్రేమ ఉందని టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.
 
 టీఆర్‌ఎస్ కూడా అదే వారసత్వాన్ని తీసుకుందన్నారు. సీడెడ్ జిల్లాలను నిజాం నాడు బ్రిటిష్ వారికి రూ.9 లక్షలకు అమ్మి, ఆ డబ్బుతోనే జల్సాలు చేశారన్నారు. ఆ వాదనను అక్బర్ మళ్లీ తిప్పికొట్టారు. ‘‘ఇండో చైనా యుద్ధ సమయంలో కేంద్రానికి నిజాం రెండు లారీల బంగారు నాణేలిచ్చారు. బనారస్ హిందూ యూనివర్సిటీకి రూ.10 లక్షలిచ్చారు. యాదగిరిగుట్ట, తిరుమల, భద్రాచలం వంటి పలు దేవాలయాలకు నిధులిచ్చి నిజమైన లౌకికవాదాన్ని ప్రదర్శించారు’’ అని చెప్పారు. కాంగ్రెస్ తరఫున మంత్రి శైలజానాథ్, ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు అక్బర్‌పై విమర్శలకు దిగారు. జాతి వ్యతిరేక ప్రసంగాలు చేస్తున్నారనే విధంగా వ్యాఖ్యానించారు. దాంతో ఎంఐఎం సభ్యులు తీవ్ర నిరసనకు దిగారు. క్షమాపణ చెప్పాలంటూ పట్టుబట్టారు.
 
 అసదుద్దీన్‌తో కేటీఆర్ భేటీ
 సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారక రామారావు అసెంబ్లీ ఆవరణలో సోమవారం భేటీ అయ్యారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీరుపై, రాజ్యసభ అభ్యర్థుల అంశంపై వీరి మధ్య చర్చ జరిగింది. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేసినట్టు ప్రచారం చేసుకుం టున్న బాబుకు దీటుగా సమాధానం చెప్పాలని, టీడీపీని దెబ్బకొట్టడానికి ఎవరి మార్గంలో వారు పనిచేయాలని అనుకున్నారు. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థిని నిలబెడుతున్నారా అని కేటీఆర్‌ను అసదుద్దీన్ ప్రశ్నించగా.. ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇప్పటిదాకా 23 మంది ఎమ్మెల్యేల బలం తమకు ఉందని, అయితే రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే దాదాపు 40 మంది మద్దతు అవసరమని అన్నారు. మిగిలిన వారి మద్దతు గురించి మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నామినేషన్లకు ఇంకా సమయం ఉందని, అన్ని కోణాల్లో చర్చించిన తర్వాత అభ్యర్థిపై నిర్ణయం ఉంటుందని కేటీఆర్ సమాధానమిచ్చారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)