amp pages | Sakshi

హోదా ముగిసిన అధ్యాయం: వెంకయ్య

Published on Tue, 11/08/2016 - 03:27

కేంద్ర మంత్రి  వెంకయ్యనాయుడు వ్యాఖ్య
 
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి మోసం జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రతిపక్ష నేతలను వెంకయ్య ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రస్తుతం ఉద్యమాలు చేస్తూ ప్రధాని మోదీని, తనను విమర్శిస్తున్న వారు రాష్ట్ర విభజన సమయంలో ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడు, ఏకపక్ష విభజన జరుగుతున్నప్పుడు వీళ్లందరూ ఎక్కడ ఉన్నారు. ఉద్యమించే వాళ్లందరూ ఆరోజు ఎక్కడున్నారు? ఏమి చేశారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్నిగానీ, రాష్ట్ర ప్రభుత్వాన్నిగానీ విమర్శిస్తే బాగుంటుంది. ఇది నా సలహా’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

ప్రస్తుతం విమర్శలు చేసేవారు విభజన జరుగుతున్న సమయంలో అన్యాయాన్ని ఎలా ఎదుర్కున్నారో ప్రజలకు వివరిస్తే ఆ తర్వాత వారు చెప్పే మాటలకుగానీ, చేసే విమర్శలకు గానీ విశ్వసనీయత ఉంటుందన్నారు. ప్రధాన మంత్రి మోసం చేశారు, వెంకయ్యనాయుడు మోసం చేశారని చెప్పే వాళ్లందరూ ఆ రోజు పచ్చి మోసం జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉన్నారో, పార్టీగా, వ్యక్తులుగా సంస్థలుగా ఏమి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘పై పెచ్చు ఈ సమస్య (ప్రత్యేక హోదా) ఏదైతే ఉందో అది ముగిసిన అధ్యాయం. ఏపీకి కేంద్ర సహకారం అవసరం’ అన్నారు. ఒక్క హామీనైనా నెరవేర్చారా అని కొందరు ప్రశ్నలు వేస్తున్నారని, ఏపీకి  కేంద్ర ప్రభుత్వం అందించే సాయం చూసే వాళ్లకు కనిపిస్తుందని వెంకయ్యనాయుడు వివరించారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)