amp pages | Sakshi

7న మరో తుపాను!

Published on Sat, 11/03/2018 - 05:08

సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఈనెల ఏడో తేదీన మరో తుపాను ఏర్పడబోతోంది. ఇది తమిళనాడు, రాయలసీమలపై ప్రభావం చూపుతుంది. అయితే ఇది తుపానుగానే కొనసాగుతుంది తప్ప తీవ్రరూపం దాల్చే అవకాశం లేదని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ కేజే రమేష్‌ తెలిపారు. అనంతరం ఆ తుపాను అరేబియా సముద్రంలోకి ప్రవేశించి అక్కడ మరింత బలపడుతుందన్నారు. ఈ తుపాను ప్రభావంతో తమిళనాడు, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురవడానికి వీలుందన్నారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలపై తక్కువగా ఉంటుందని, దీంతో అక్కడ లోటు వర్షపాతం నమోదయ్యే వీలుందని చెప్పారు.

తమిళనాడులో మాత్రం సాధారణంకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందన్నారు. ఐఎండీ అంచనా వేసిన మేరకే నైరుతి రుతుపవనాల సీజనులో వర్షపాతం నమోదైందని, గతేడాదికంటే రిజర్వాయర్లలో నీటిమట్టాలు 117 శాతానికి పెరిగాయని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో దేశంలో ఆహారధాన్యాల దిగుబడి 1.8 శాతం మాత్రమే తక్కువని పేర్కొన్నారు. తిత్లీ తుపాను తీరం దాటే  ప్రాంతాన్ని ఐఎండీ సరిగా అంచనా వేయలేకపోయిందన్న విమర్శలను ఆయన కొట్టేశారు. ఐఎండీ అంచనా వేసిన ప్రాంతంలోనే తీరం దాటిందని, ఇది ఐఎండీ కచ్చితత్వానికి నిదర్శనమని చెప్పారు. తుపాను కళింగపట్నం–ఇచ్ఛాపురంల మధ్య తీరాన్ని దాటుతుందని అక్టోబర్‌ 10వ తేదీ ఉదయమే ఐఎండీ వెల్లడించిందని, దీనికి అనుగుణంగానే తిత్లీ 30 కిలోమీటర్ల దూరంలో తీరం దాటిందని తెలిపారు. అయితే ముందస్తు సమాచారం సాంకేతిక కారణాల వల్ల సమాచార, ప్రసార మాధ్యమాలకు చేరకపోయి ఉండవచ్చన్నారు. వాతావరణశాఖలో 1,102 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ జరుగుతోందని, దీంతో సిబ్బంది కొరత సమస్య తీరుతుందని రమేష్‌ చెప్పారు. 



ముంపు ముప్పుపై ముందస్తు సమాచారం..: ఇకపై వరద, తుపానుల వల్ల ముంపు ముప్పు ఎక్కడ ఏర్పడుతుందన్న దానిపై ముందస్తు సమాచారం ఇవ్వగలుగుతామని ఆయన తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 25 వేల మైక్రోవాటర్‌ షెడ్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచ వాతావరణ సంస ప్రమాణాలకనుగుణంగా ఫ్లాష్‌ ఫ్లడ్‌ గైడెన్స్‌ విధానంలో ఇవి పనిచేస్తాయన్నారు.

మొదలైన ‘ఈశాన్య’ వర్షాలు
రాయలసీమలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురవడం మొదలయింది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు దక్షిణ తమిళనాడుపై కొమరిన్‌ ప్రాంతానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. ఈనెల 6 నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. దీని ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలపై ఉంటుందని అంచనా వేస్తోంది. గడచిన 24 గంటల్లో తొట్టంబేడులో 8, నగరిలో 7, శ్రీకాళహస్తి, కందుకూరులో 6 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. 

అమరావతిలో ఐఎండీ కేంద్రం!
రాజధాని అమరావతిలో ఐఎండీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు రమేష్‌ వెల్లడించారు. అక్కడ ఐఎండీ భవన నిర్మాణానికి ప్రభుత్వం ఎకరం భూమి కేటాయించిందని, దీని నిర్మాణానికి కొంత సమయం పట్టనుందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం భవనాల్లో గదులను అద్దెకు తీసుకుని తాత్కాలికంగా ఐఎండీ కేంద్రాన్ని నడుపుతామని చెప్పారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)