amp pages | Sakshi

కాపులకు ఏపీ సర్కార్‌ శుభవార్త

Published on Wed, 11/27/2019 - 16:10

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం జగన్‌ పలు కీలక నిర్ణయాలను మంత్రి మండలితో చర్చించారు.  వైఎస్సార్‌ నవశకం పథకాలపై,  కొత్త పెన్షన్‌ కార్డులు, పెన్షన్‌ అర్హతల మార్పులపై చర్చించారు. అదే విధంగా కొత్త రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, జగనన్న విద్యా దీవెన కార్డుల జారీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. డిగ్రీ ఆపై ఉన్నత విద్యా కోర్సులు చదివే విద్యార్థులకు జగనన్న వసతి పథకం కింద రూ. 20 వేలు చెల్లింపు, వైఎస్సార్‌ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనలపై, కొత్త బార్‌ పాలసీలకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు:
వైఎస్సార్‌ కాపు నేస్తం పథకానికి రూ.1,101కోట్ల కేటాయింపు
కాపు సామాజిక మహిళలకు ఏడాదికి రూ.15వేలు సాయం
45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఐదేళ్లలో రూ.75వేలు సాయం
రెండున్నర లక్షల రూపాయల ఆదాయం ఉన్న కాపులకు వైఎస్సార్‌ కాపు నేస్తం వర్తింపు
పది ఎకరాల మాగాణి, 25ఎకరాల లోపు మెట్ట ఉన్నవారికి వర్తింపు
ట్రాక్టర్‌, ఆటో, ట్యాక్సీ నడుపుకునేవారికి మినహాయింపు
టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య 19నుంచి 29కి పెంచుతూ నిర్ణయం
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కేబినెట్‌ నిర్ణయం
ఉగాది నాటికి 25లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ

ఇళ్ల పట్టాలపై పేదలకు హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్‌కు నిర్ణయం
జగనన్న వసతి పథకానికి కేబినెట్‌ ఆమోదం​.రెండు విడతలుగా జగనన్న వసతి దీవెన, రూ.2,300 కేటాయింపు
ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15వేలు
డిగ్రీ, ఉన్నత విద్యార్థులకు ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సాయం
కడప స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపనకు కేబినెట్‌ ఆమోదం. 
3.295 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయం.
ఇనుప ఖనిజం సరఫరాపై ఎన్‌ఎండీసీతో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ కార్పొరేషన్‌ బ్యాంకు నుంచి రుణాలు
మద్యం ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాలపై ఆమోదం
ఫీజు రియింబర్స్‌మెంట్‌ కోసం రూ.3,400 కోట్లు కేటాయింపు
రూ.225లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి విద్యాదీవెన వర్తింపు
సీపీఎస్‌ రద్దుపై ఏర్పాటైన వర్కింగ్‌ కమిటీకి ఆమోదం
గిరిజన ప్రాంతాల్లో ఆశావర్కర్ల జీతం రూ. 400 నుంచి రూ.4వేలకు పెంపు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)