amp pages | Sakshi

డీఏ 5.992%

Published on Fri, 10/10/2014 - 01:07

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ
జూలై నుంచి వర్తింపు.. కొత్త రాష్ట్రంలో ఇదే తొలి పెంపు
పెరిగిన భత్యాన్ని 1న అక్టోబర్ జీతంతో అందుకోనున్న ఉద్యోగులు

 
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం(డీఏ) 5.992 శాతం పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రాష్ట్రంలో డీఏ పెంపు ఉత్తర్వులు ఇవ్వడం ఇదే తొలిసారి. తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ 71.904 శాతం నుంచి 77.896 శాతానికి పెరగనుంది. ఈ ఏడాది జూలై 1 నుంచి పెంపు వర్తిస్తుంది. తాజా పెంపు మేరకు డీఏను నవంబర్ 1న ఇవ్వనున్న అక్టోబర్ జీతంతో కలిపి నగదు రూపంలో చెల్లించనున్నారు. జూలై నుంచి సెప్టెం బర్ వరకు 3 నెలల డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు. జీపీఎఫ్ ఖాతాలు లేని ఉద్యోగులకు ఎస్‌పీఎఫ్(స్టేట్ ప్రావిడెంట్ ఫండ్) ఖాతాల్లో వేయనున్నారు.

 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి డీఏ బకాయిల్లో 10 శాతం ‘చందాతో కూడిన పెన్షన్’ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శాశ్వత ఖాతా లో జమ చేయనున్నారు. బకాయిల్లో మిగతా 90 శాతాన్ని నగదు రూపంలో ఇవ్వనున్నారు.  2005 పీఆర్సీ స్కేళ్లలో కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 179.922 శాతం నుంచి 191.226 శాతానికి పెంచనున్నారు.
 
1999 పీఆర్సీ స్కేళ్ల ప్రకారం జీతాలు తీసుకొంటున్న ఉద్యోగులకు 186.504 శాతం నుంచి 196.32 శాతానికి డీఏ పెరగనుంది.
 ఐదో జుడీషియల్ వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలు పొందుతున్న జుడీషియల్ అధికారుల డీఏ 200 శాతం నుంచి 212 శాతానికి పెరగనుంది.

 ఈ.పద్మనాభన్ కమిటీ నివేదిక ప్రకారం జీతాలు తీసుకుంటున్న జుడీషియల్ అధికారుల డీఏ 100 శాతం నుంచి 107 శాతానికి పెరగనుంది. గ్రామ సేవకులు, పార్ట్‌టైం అసిస్టెంట్లకు రూ. 100 పెరగనుంది. డీఏ బకాయిల వివరాలను నిర్ధారిత ప్రొఫార్మాలో ఉద్యోగులు సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో సమర్పించాలని ఆర్థిక శాఖ సూచించింది. పెన్షనర్లకు కూడా ఈ మేరకు కరవు భృతి(డీఆర్) పెరగనుంది.

పీఆర్సీ అమలు చేయాలి: ఉద్యోగులు

ధరలు మండిపోతున్న నేపథ్యంలో సగటు వేతన జీవులు అల్లాడిపోతున్నారని, వెంటనే పదో పీఆర్సీని అమలు చేయడానికి చర్యలు చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కనీసం 50 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కత్తి నరసింహారెడ్డి, ప్రధానకార్యదర్శి సిహెచ్.జోసఫ్ సుధీర్‌బాబు కోరుతున్నారు.
 
 

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కడప (వైఎస్ఆర్ కడప జిల్లా)

ఏపీకి మళ్లీ జగనే సీఎం: KCR

పచ్చ మందపై విరుచుకుపడ్డ సీఎం జగన్ దద్దరిల్లిన నగరి...

Watch Live: పుత్తూరులో సీఎం జగన్ ప్రచార సభ

నేనంటే భయమెందుకు బాబు

జనం జాగ్రత్త.. వీళ్లు మామూలోళ్లు కాదు

పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..

వివేకా కేసు..కోర్టులో సునీతకు ఎదురుదెబ్బ..

లోకేష్ కి ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)