amp pages | Sakshi

‘గంటా వల్లే జూనియర్‌ లెక్చరర్లకు అన్యాయం’

Published on Sun, 09/15/2019 - 14:50

సాక్షి, విజయవాడ: మాజీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు అవినీతి పనుల వల్ల జూనియర్ లెక్చరర్స్‌కు అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె ఆర్‌ సూర్య నారాయణ ఆరోపించారు. ఏపీ డైరెక్ట్‌ రిక్రూటెడ్‌ జూనియర్‌ లెక్చరర్స్‌ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో కె ఆర్‌ సూర్య నారాయణతోపాటు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె ఆర్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ ప్రమోషన్ల వల్ల డైరెక్ట్ రిక్రూట్ వారికి అన్యాయం జరిగిందని తెలిపారు. అక్రమ ప్రమోషన్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు.

గత ప్రభుత్వంలో జూనియర్‌ లెక్చరర్స్‌ నుంచి ప్రిన్సిపాల్స్‌గా అక్రమంగా ప్రమోషన్స్‌ పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి అవినీతి చర్యలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య శాఖలను ప్రక్షాళన చేయాలని భావిస్తోందన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కారావు మాట్లాడుతూ శాఖాపరంగా ఎన్నో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. డైరెక్ట్‌ రిక్రూటెడ్‌ జూనియర్‌ లెక్చరర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా జూనియర్‌ లెక్చరర్ల ప్రమోషన్స్‌ అవకతవకలు సరిచేస్తామని హామీ ఇచ్చారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)