amp pages | Sakshi

ప్రజల వద్దకు బ్యాంకర్లు

Published on Thu, 01/07/2016 - 23:38

 విజయనగరం అర్బన్: బ్యాంకుల్లో బారులు తీరి నించునే రోజులు పోయి బ్యాంకర్లే గ్రామాలకు వచ్చి వినియోగదారుల ముందు బారులు తీరుతున్నారు. బ్యాంక్ శాఖకు పరిధిలో ఉన్న ప్రజలు, ఖాతాదారులకు అందుబాటులో బ్యాంక్ అధికారులు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆదేశాలు జిల్లా లీడ్ బ్యాంక్ కార్యాలయానికి బుధవారం వచ్చాయి. ఏడాదిగా కేంద్రప్రభుత్వం అందిస్తున్న సేవింగ్ ఖాతాల ప్రారంభించడం, బీమా, రుణ, పెన్షన్ పథకాలను విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, ఆ దిశగా ప్రజలకు తెలియజే కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొన్నారు.
 
 ఇందుకోసం జిల్లాలోని ప్రతి బ్యాంక్ శాఖ సిబ్బంది కృషి చేయాలని సూచించారు. బ్యాంక్ శాఖలు లేని గ్రామాల్లో బిజినెస్ కరెస్పాండెంట్‌లను తక్షణమే నియమించుకోవాలని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు బ్యాంక్ పరిధిలో గ్రామాలకు ప్రతి బుధవారం మధ్యాహ్నం పూట బ్యాంకర్లు విధిగా వెళ్లి జన్మభూమి కమిటీల సమక్షంలో ప్రజలకు ఖాతాదారులకు, గ్రామ సభలను నిర్వహించాలి. అదే పట్టణ పరిధిల్లో అయితే బ్యాంక్ కార్యాలయం ఆవరణలో ఖాతాదారులకు ప్రతి బుధవారం మధ్యాహ్నం పూట అవగాహన సదస్సులను నిర్వహించాలి.
 
 నివేదికలు పంపాలి: లీడ్ బ్యాంక్ మేనేజర్
 రాష్ట్ర స్థాయి లీడ్ బ్యాంక్ ఆదేశాల మేర కు బ్యాంకర్లు ప్రతి బుధవారం జన్మభూమి కమిటీలతో నిర్వహించిన సదస్సుల నివేదికను జిల్లా కేంద్రాలకు పంపాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎ.గురవయ్య తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రతి బుధవారం గ్రామాలకు వెళ్లి గ్రామ సభలను నిర్వహించాలని తెలి పారు. అదే పట్టణ ప్రాంతాలలో అయితే ప్రతి బుధవారం బ్యాంక్ కార్యాలయం ఆవరణలో నిర్వహించాలని ఆదేశాలొచ్చాయని చెప్పారు. వారంలో అందజేసిన వివిధ రకాల సేవలకు ఖాతాదారులకు వివరిస్తూ బ్యాంకింగ్ వ్యవస్థ తాలూకా ప్రాధాన్యతను వివరించాలని పేర్కొన్నారు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌