amp pages | Sakshi

తీరంలో అప్రమత్తం

Published on Sat, 01/25/2014 - 03:01

 శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: జిల్లాలోని సముద్ర తీరంలో హై అలెర్ట్ ప్రకటించారు. తీరప్రాంతాల్లో మైరెన్ పోలీసులు నిఘా పెట్టి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 26న జరుగనున్న గణతంత్ర వేడుకల్లో తమ ఉనికిని చాటుకునేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్టు రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారి చేశాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం సముద్ర తీరంపై నిఘా పెడుతున్నట్టు మెరైన్ ఐజీ
 ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 192 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సముద్ర తీరం వెంబడి మెరైన్ పోలీసులు పూర్తి నిఘా పెట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానితులు తారసపడితే వారిని అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. సముద్రమార్గం గుండా బోట్లలో ఎవరైనా జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలున్నాయన్నది ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఇలా జిల్లాలోకి చేరుకుని ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో గమ్యస్థానాలకు చేరుకుని విధ్వంసానికి పాల్పడే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గస్తీని మరింత ముమ్మరం చేశారు.
 
  తీర ప్రాంత గ్రామాల్లోని ప్రజలకు ఉగ్రవాదులు చోరబడే అవకాశాలున్న మార్గాలను వివరించి, ఎవరైనా అనుమానితులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని మెరైన్ పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు జిల్లా పోలీసు యంత్రంగం కూడ అప్రమత్తమైంది. ప్రధాన మార్గాల్లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాలకు అనుకుని ఉన్న రోడ్డు మార్గాల పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ మేరకు సముద్రతీర ప్రాంతాల్లో ఉన్న పోలీసు స్టేషన్లకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)