amp pages | Sakshi

ఓటు హక్కు బలమైన ఆయుధం: గవర్నర్‌

Published on Sat, 01/25/2020 - 14:24

సాక్షి, విజయవాడ: సమాజంలో ఓటు హక్కు ఒక బలమైన ఆయుధమని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. అర్హత ఉన్నవారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. 10వ జాతీయ ఓటర్ల దినోత్సం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యాక్రమంలో గవర్నర్‌ పాల్గొన్నారు. నూతనంగా ఓటు హక్కు పొందినవారికి ఆయన ఓటరు కార్డులు అందచేశారు. అలాగే 2019 సార్వత్నిక ఎన్నికల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన 13 జిల్లాలకు చెందిన అధికారులకు అవార్డులు అందచేశారు. ‘రాజ్యాంగంలో ఆర్టికల్‌ 14 అందరికీ సమాన హక్కుల గురించి తెలుపుతుంది. ఓటు హక్కు ఉన్నా వినియోగించుకోకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కోల్పోతారు. మీరు ఓటు వేసి మీ స్నేహితులకు కూడా అవగాహన కల్పించి ఓటు వేయించండి’  అని గవర్నర్‌ పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ మాట్లాడుతూ... ‘కొన్ని సంవత్సరాల క్రితం సామాన్య మనిషికి తన హక్కులు పొందే వ్యవస్థ లేదు. ప్రజా పోరాటాల ఫలితంగా హక్కులు వచ్చాయి. వందేళ్ల పెనుమార్పుల ఫలితంగా ఈ వ్యవస్థ ఏర్పడింది. 28 దేశాలలో ఓటు వేయడం హక్కుగానే కాక ఓటు వేయకుంటే పెనాల్టీ వేసే విధానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. మన ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో అన్ని దేశాల కంటే మెరుగైనది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే నిబద్ధతతో ఉండాలి. పట్టణాలలో గ్రామీణ ప్రాంతాల కన్నా ఓటు హక్కును తక్కువ శాతం వినియోగించుకుంటున్నారు. ముందు తరాలకు మనం ఇచ్చే వారసత్వపు హక్కు ఓటు హక్కు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీజీ డాక‍్టర్‌ రవిశంకర్‌, జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)