amp pages | Sakshi

చిత్తూరు తాగునీటి పథకానికి బ్రేక్

Published on Fri, 03/07/2014 - 03:09

 సాక్షి, చిత్తూరు:
 తెలుగుగంగ నీటిని చిత్తూరు పట్టణంతోపాటు, పీలేరు, మరికొన్ని గ్రామీణ ప్రాంతాలకు తరలించే పథకానికి బ్రేక్ పడినట్లే. తాగునీటి పైప్‌లైన్ నిర్మాణానికి రూ.5,900 కోట్లతో పథకం చేపట్టనున్నట్లు అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వాగ్దానం ఎన్నికల జిమ్మిక్కుగానే మిగిలిపోనుంది. ఆయన పదవి నుంచి దిగిపోతూ ఈ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయింపులు చేశారు. ఈ నిధు లు ఒక మూలకు చాలవు. అరుుతే ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లలో అవినీతి జరిగిందని, ఆయన బంధువులు సూచించిన కంపెనీకే టెండ ర్లు ఇచ్చినందున విచారణ జరపాలని మాజీ మం త్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశారు. ఈ క్రమంలో ఈ పథకానికి వేల కోట్ల రూపాయలు నిధులు ఎక్కడి నుంచి వస్తా యి, ఈ ప్రాజెక్టు కొనసాగుతుందా అనే  సందేహా లు వ్యక్తమవుతున్నాయి.
 
  ఇప్పటికే చిత్తూరు తాగునీటి పథకాన్ని నిలిపేయాలని, ఒకే జిల్లాకు తాగునీటికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా కేటాయిస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు హరీష్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులోవిచారణ జరుగుతోంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో చిత్తూరు, పీలేరు పట్టణం సహా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కండలేరు నుంచి మంచినీటి సరఫరా చేసేందుకు పైపులైన్ నిర్మాణానికి ఉద్దేశించిన ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యేలా కనపడడం లేదు.
 
 ఇదిలా ఉండగా చిత్తూరు తాగునీటి పథకానికి మొదటి దశకే రూ.4 వేల కోట్ల నిధులు అవసరమవుతాయి. ఈ నిధులు ఉంటే జిల్లాకు తాగునీరు, సాగునీరు అందించే గాలేరు-నగరి ప్రాజెక్టు పూర్తవుతుంది. దీని ద్వారా చిత్తూరు పట్టణానికి నీటిని అందించడం కూడా సులభం. ఇది వదిలేసి తాగునీటి ప్రాజెక్టు పేరుతో రూ.5900 కోట్లు ఖర్చుచేసే పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర విభజన నేపథ్యంలో సాధ్యమేనా అన్నది సమాధానం లేని ప్రశ్న. ఇది కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల సంవత్సరంలో ప్రజలను మభ్యపెట్టేందుకు చేసిన హామీనే అని స్పష్టమవుతోంది.
 
 టెండర్ల కేటాయింపుపై ఆరోపణలు
 చిత్తూరు తాగునీటి పథకానికి సంబంధించి టెండర్లు కేటాయింపుల్లోనే అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించడం, గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం జిల్లాలో చర్చనీయంశంగా మారింది. అలాగే ఆయన మాజీ సీఎం కిరణ్ హయూంలో మంజూరైన ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులపై విచారణ జరపాలని ఆ లేఖలో కోరడం గమనార్హం. వీటిల్లో చిత్తూరు తాగునీటి పథకం వ్యవహారం ఉండడం గమనార్హం.
 

Videos

జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)