amp pages | Sakshi

'దగా'రులు

Published on Mon, 02/18/2019 - 11:50

వారం రోజులుగా ఒడిదుడుకులకు గురవుతున్న టమాట రేట్లు ఆదివారం నాటికి మరింత పతనమయ్యాయి. మదనపల్లె మార్కెట్‌కు తక్కువ మోతాదులో టమాటాలు వస్తున్నా వ్యాపారులు, అధికారుల సిండికేట్‌తో కర్షకుల కష్టం దోపిడీకి గురవుతోంది. నిబంధనలకు నీళ్లు వదులుతూ ఈ–వేలానికి బదులు బహిరంగ వేలంనిర్వహిస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారు. ఉన్నతాధికారులు సైతం పట్టనట్లు వ్యవహరిస్తుం డడంతో తమకు ఆత్మహత్యలేశరణ్యమని అన్నదాతలు వాపోతున్నారు.

చిత్తూరు, మదనపల్లెటౌన్‌: మదనపల్లె మార్కెట్లో ఒక్కో రోజు ఒక్కో రకంగా టమాటా ధరలు పలుకుతూ రేట్లు పతనమవుతున్నాయి. తక్కువగా టమాటాలు వస్తున్నా వ్యాపారులు, అధికారులు కుమ్మక్కవడంతో ధరలు పడిపోతున్నాయి. రోజు రోజుకు టమాటా ధరలు పతనం దిశగా పరుగులు తీస్తుండడంతో రవాణా చార్జీలు కూడా గిట్టడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం మదనపల్లె మార్కెట్లో అధికారులు, వ్యాపారుల గూడుపుఠానీ కారణంగా ఈ–వేలం పాటలకు మంగళం పాడి చట్టవిరుద్ధంగా బహిరంగ వేలం నిర్వహిస్తూ రైతులను నిలువుదోపిడీ  చేస్తున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా...
డివిజన్‌తో పాటు పశ్చిమ మండలాలైన అనంతపురం జిల్లాల నుంచి రోజూ మార్కెట్‌కు 200 టన్నుల వరకు టమాటా వస్తోంది. ఇవే కాకుండా ఛత్తీస్‌గఢ్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లో టమాటా ఉత్పత్తి అధికంగా ఉండడంతో అక్కడి కాయలను ఇక్కడి మండీ వ్యాపారులు, మార్కెట్‌ అధికారులతో కుమ్మక్కై బయట రాష్ట్రాల టమాటా లారీలను రాత్రికి రాత్రే మదనపల్లె మార్కెట్‌కు తీసుకువచ్చి గుట్టు చప్పుడు కాకుండా అన్‌లోడ్‌  చేస్తున్నారు. వ్యాపారులు కొన్నాక తిరిగి లోడ్‌చేసి తెల్లవారకనే పొరుగు రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. దీంతో వ్యాపారులు పెద్దగా మదనపల్లె పరిసర ప్రాంతాల  రైతులు తీసుకు వచ్చే టమాటాలను కొనడం లేదు. స్థానిక వ్యాపారులు కొందరు మాత్రమే ఉదయం ఓపెన్‌ ఆక్షన్‌లో కొంటున్నారు.

నిబంధనలకు పాతర
నిబంధనల ప్రకారం వ్యాపారులు, మార్కెట్‌ అధికారులు, టమాటాలను తీసుకు వచ్చిన రైతులు ముందుగా ఓ గదిలో సమావేశం అయ్యాక ఈ–వేలం నిర్వహించాలి. ఆ తతంగం లేట్‌ అవుతుందని వ్యాపారులతో మార్కెట్‌ అధికారులు కుమ్మక్కై ఓపెన్‌ ఆక్షన్‌ నిర్వహిస్తున్నారు. స్థానికంగా కాయలు కొంటున్న ఒకరిద్దరు వ్యాపారులు ఒక రోజు కాయలు కొనడానికి వస్తే మరో రోజు మార్కెట్‌కు రావడం లేదు. దీంతో మార్కెట్‌లో ఒక్కో రోజు ఒక్కో రకంగా టమాటా ధరలు పలుకుతున్నాయి. ఇప్పుడే టమాటా ధరలు పతనమైతే ఎండలు ముదిరి దిగుబడి తగ్గితే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ మాసాల్లో తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

అధికారులు స్పందించాలి
వ్యవసాయ మార్కెటింగ్‌ కమిషనర్, కలెక్టర్, మార్కెటింగ్‌ రీజనల్‌ మేనేజర్‌లు స్పందించి ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి మదనపల్లె టమాటా మార్కెట్‌కు బయట టమాటాలు రాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.  మార్కెట్‌ అధికారులు మాత్రం రైతుల కష్టాలు పట్టించుకోకుండా మార్కెట్‌కు ఎన్ని టన్నుల టమాటా వస్తే అంత ఆదాయం వస్తుందని ఆశించి పొరుగు రాష్ట్ర, జిల్లాల టమాటాను కూడా అనుమతిస్తున్నారు. దీంతో మదనపల్లె పరిసర ప్రాంతాల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)