amp pages | Sakshi

నాయుడుగారి తోటలో..!

Published on Sat, 11/17/2018 - 07:31

శ్రీకాకుళం, టెక్కలి: పెద్ద పెద్ద నగరాల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతూ గుట్టు చప్పుడు కాకుండా విస్తరిస్తున్న పేకాట వ్యాపారం ఇప్పుడు జిల్లా కేంద్రంలో పాగా వేసింది. పేకాట ఆడాలనే ఆసక్తి ఉంటే చాలు నిర్వాహకులు వేల రూపాయలు చెల్లించి వాహనాలు ఏర్పాటు చేసి మరీ పేకాట ప్రియులను శిబిరాల వద్దకు చేర్చేలా  ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రం నుంచి సమీప ప్రాంతాల్లోని తోటల్లో మూడుముక్కలాట, సూట్‌ వంటి పేకాటల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం. నిన్నటి వరకు డివిజన్‌ కేంద్రమైన టెక్కలిలో కొనసాగిన పేకాట వ్యవహారంపై ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాలతో జూదరులు జిల్లా కేంద్రంలోని బడా పేకాట శిబిరాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి పెద్ద ఎత్తున ఈ పేకాట వ్యాపారాన్ని కొనసాగిస్తూ రోజుకు కోట్ల రూపాయలు చేతులు మారుస్తున్నట్లు వినికిడి.

ఈ వ్యాపారంలో భాగంగా మంత్రి కార్యాలయంలో కీలకంగా ఉన్న ఓ వ్యక్తికి నెలవారీ లక్షల రూపాయలు ముట్టజెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాపారానికి అడ్డం అనుకునే ప్రతీ వ్యక్తి అది పోలీస్‌ అయినా మీడియా అయినా.. కొంత మొత్తాలు చెల్లిస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఓ బాధితుడికి సంబంధించి మహిళా జిల్లా పోలీసులకు సమాచారం ఇస్తే మంత్రి కార్యాలయంలో కీలక వ్యక్తి ఆదిలోనే అడ్డుకున్నట్లు సమాచారం. బడా పేకాట శిబిరంలో పెద్ద పెద్ద తలకాయలు ఉండడంతో పోలీస్‌ యంత్రాంగం ఆ వైపు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాలు సామాన్యులతో పాటు పేకాట వ్యాపారాన్ని కొనసాగిస్తున్న నిర్వాహకుల మధ్య చర్చనీయాంశంగా మారాయి.  

Videos

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)