amp pages | Sakshi

సిట్టింగులకే సీట్లు!

Published on Sun, 02/24/2019 - 06:55

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులపై దాదాపు స్పష్టత వచ్చింది. జిల్లాలోని మెజారిటీ సీట్లలో సిట్టింగులకే ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లె, శ్రీశైలం నియోజకవర్గాల్లో ప్రస్తుతమున్న అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి, బీసీ జనార్దనరెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డికే సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. పాణ్యం, నందికొట్కూరు సీట్ల విషయం మాత్రం ఇంకా తేలలేదు. పాణ్యంలో ఇన్‌చార్జ్‌ ఏరాసు ప్రతాప్‌రెడ్డి పనితీరు బాగోలేకపోవడం.. నందికొట్కూరు ఇన్‌చార్జ్‌ మాండ్ర శివానందరెడ్డికి, గతంలో పోటీ చేసిన లబ్బి వెంకటస్వామికి మధ్య వైరుధ్యాల కారణంగా ఈ రెండు సీట్లను తేల్చలేదని తెలుస్తోంది.

నంద్యాల సీటు సిట్టింగ్‌ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డికి ఇవ్వడాన్ని ఎంపీ ఎస్పీవై రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు ఏవీ సుబ్బారెడ్డికి ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అయితే, మంత్రి ఫరూక్‌ మాత్రం బ్రహ్మానందరెడ్డికి మద్దతు తెలిపినట్టు సమాచారం. ప్రాథమికంగా నంద్యాల సీటు బ్రహ్మనందరెడ్డికే ఇవ్వాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇప్పటికే కర్నూలు పార్లమెంటు పరిధిలోని కర్నూలు అసెంబ్లీ స్థానానికి ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆలూరుకు కోట్ల సుజాతమ్మ, ఆదోని బుట్టారేణుక, ఎమ్మిగనూరు  జయనాగేశ్వరరెడ్డి, మంత్రాలయం  తిక్కారెడ్డి, పత్తికొండ కేఈ శ్యాంబాబుతో పాటు నంద్యాల పార్లమెంటు పరిధిలోని డోన్‌కు కేఈ ప్రతాప్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కోడుమూరు, పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యే సీట్లతో పాటు నంద్యాల ఎంపీ సీటును టీడీపీ ఖరారు చేయాల్సి ఉంది.

రూ.60 కోట్లు సమకూర్చుకోవాలని... 
కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టీడీపీ తరఫున బరిలో ఉండనున్నారు.  నంద్యాల ఎంపీ సీటు విషయంలో మాత్రం ఇంకా తేలలేదు. మొదట్లో మాండ్ర శివానందరెడ్డి పేరు వినిపించింది. అయితే, ఈ సీటు తమకే కావాలని ఎంపీ ఎస్పీవై రెడ్డి పట్టుబట్టడంతో  చంద్రబాబు కొత్త కొర్రీలను వేసినట్టు సమాచారం. ఎన్నికల ఖర్చు కోసం రూ.60 కోట్లు సమకూర్చుకోవాలని, సదరు మొత్తం డిపాజిట్‌ను తమకు చూపాలని పార్టీ అధిష్టానం సూచించింది. ఇప్పటికే తాము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని తెలిసీ రూ. 60 కోట్లు అడగడం ఏమిటని ఎస్పీవై రెడ్డి వర్గం వాపోతోంది.

తాము అంత మొత్తం సమకూర్చుకోలేమనే ఉద్దేశంతోనే ఈ విధంగా కొర్రీలు వేశారని ఆక్రోశం వెలిబుచ్చుతోంది. ఎంపీ సీటు ఇస్తామని చెబుతూనే ఎగ్గొట్టేందుకు ఈ కొత్త విధానాన్ని తెరమీదకు తెచ్చారని అంటున్నారు. ఎవరినీ అడగకుండా తమను మాత్రమే డబ్బు గురించి అడగటం ఏమిటని వాపోతున్నారు. మరోవైపు ఎన్నికల ఖర్చుకు అవసరమైన మొత్తం తన వద్ద లేదని నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి నేరుగా చంద్రబాబు ముందే కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. ఎన్నికల ఖర్చును పార్టీనే భరించాలని కూడా కోరినట్టు తెలిసింది. ఈ విధంగా ఖర్చును భరించలేమన్న వారికి సీటు కేటాయిస్తున్నట్టు చెప్పి.. తమను మాత్రం ఎందుకు రూ.60 కోట్లు అడిగారని ఎస్పీవై రెడ్డి వర్గం వాపోతోంది.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)