amp pages | Sakshi

అహనా..కోడంట!

Published on Mon, 06/15/2015 - 10:40

కిలో చికెన్ రూ.200-220
రికార్డు స్థాయిలో ధర
రోజురోజుకు పెరుగుతున్న వైనం
లైవ్ హోల్‌సేల్ కిలో రూ.115
పేదోడికి దూరమవుతున్న చికెన్ రుచి

 
ప్రాణంతో  ఉన్న ఓ కోడిని గుమ్మానికి వేలాడదీసి, దానిని చూస్తూ సినీనటుడు కోటా శ్రీనివాస రావు..ఒట్టి అన్నాన్ని లొట్టలేసుకుంటూ తింటాడు. ‘అహా.. నా పెళ్లంట’ అనే సినిమాలో ఈ దృశ్యం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. హాస్యం కోసం దర్శకుడు ఇలాంటి సన్నివేశాన్ని చిత్రీకరించాడు. అయితే నేడు పెరిగిపోతున్న చికెన్ ధరలతో ఇలా చేయక తప్పదేమో అంటున్నారు మాంసం ప్రియులు.   
ఆళ్లగడ్డటౌన్: జిల్లాలో కోడిమాంసం ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో కిలో ధర రూ. 150 ఉండగా నేడు రూ.200కు పైగా పలుకుతోంది.  రెండు నెలల క్రితం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బ్లర్డ్ ఫ్లూ రావడంతో లక్షల సంఖ్యలో కోళ్లను అధికారులు చంపి వేశారు. ఈ భయంతో ఇతర జిల్లాల్లోని కోళ్ల ఫారం యజమానులు కూడా కోళ్లను పెంచడం పూర్తిగా మానుకున్నారు. దీంతో ఈ ఏడాది కోళ్ల సంఖ్య తగ్గింది. అక్కడక్కడ పెంపకం చేపడుతున్న పాల్ట్రీ యజమానులు ధరలు పెంచేశారు. చర్మంతో కూడిన (విత్ స్కిన్) చికెన్.. పది రోజుల క్రితం కిలో రూ. 140 వరకు పలుకగా ప్రస్తుతం రూ. 200 వరకు అమ్ముతున్నారు. ఇక చర్మం లేకుండా (స్కిన్ లెస్) చికెన్ కిలో రూ. 220 వరకు విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. చికెన్ తినలేమని మాంసాహారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ధర పెరగడం గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు.

గుడ్డుకు గడ్డు కాలమే..!
పోషకాహారాల్లో గుడ్డుది ప్రధాన స్థానం. అనేక మంది శాఖహారులు సైతం గుడ్డును ఆహారంగా తీసుకుంటారు. ఇప్పటి కే పప్పుదినుసులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటడంతో గుడ్డు తిందామన్న గడ్డుకాలమే ఎదురౌతోంది. ఒక్కో గుడ్డు చిల్ల ధర రూ. 5 వరకు పలుకుతోంది. హోల్‌సేల్‌గా 100 గుడ్లు రూ 430 ధర ఉంది. సాధారణంగా హోల్‌సేల్ మార్కెట్‌లో 100 గుడ్లు రూ 275 నుంచి రూ 300 ధర ఉన్నప్పుడు ఒక్కో గుడ్డును రూ 4 అమ్మేవారు. మూడు రోజులుగా హోల్‌సేల్ మార్కెట్‌లోనే ఒక్కో గుడ్డు రూ. 5 ల పైగా అమ్ముతున్నారు. దీంతో కొన్ని రోజులు గుడ్డు తినడం మానుకోవడం మేలని ప్రజలు భావిస్తున్నారు.
 
రిటైల్ అమ్మకాలపై ప్రభావం
మార్కెట్లో చికెన్ ధరలు గణనీయంగా పెరగడంతో రిటైల్ వ్యాపారం బాగా తగ్గింది. కిలో...రెండు కిలోలు కోడి మాసం కొనేవారు పెద్దగా మక్కువ చూపడం లేదు. గతంలో ఆదివారం ఒక్క రోజే మా అంగట్లో 4 వేల కేజీలకు పైగా చికెన్ విక్రయించేవాళ్లం. ప్రస్తుతం 2వేల కేజీలు కూడా విక్రయించలేక పోతున్నావం. 20 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నా ఇంత ధర ఎప్పుడు అమ్మలేదు. చికెన్ ఇంత ధర పలుకుతుందని ఊహించను కూడా లేదు.      - షరీఫ్, చికెన్ సెంటర్ యజమాని

Videos

మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?