amp pages | Sakshi

‘జగనన్న గోరుముద్ద’పై ముఖ్యమంత్రి సమీక్ష

Published on Fri, 02/28/2020 - 20:02

సాక్షి, తాడేపల్లి: జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మధ్యాహ్న భోజనం, స్కూల్‌ కిట్స్, పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం, ఇంగ్లీష్‌ మీడియం విద్యా ప్రణాళికపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు ఆఫీస్‌లో జరిగిన ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త పాఠ్య పుస్తకాలు, వర్క్‌ బుక్స్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన కిట్స్‌ అందాలని ఈసందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పాఠశాలల్లో నాడు-నేడు పనులపై సీఎం అధికారులను ఆరా తీయగా.. అన్ని స్కూళ్లల్లో పనులు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు.
(చదవండి: పోలవరంపై అధికారులకు సీఎం జగన్‌ మార్గనిర్దేశనం)

గోరుముద్దతో మంచి ఫలితాలు..
గోరుముద్ద కార్యక్రమంతో మంచి ఫలితాలు వస్తాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ పథకంపై యాప్‌ను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. యాప్‌లో ఏ రోజు ఏ మెనూ అనే వివరాలు ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. ఎక్కడ ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే యాప్‌లో తెలియాలని అన్నారు. మార్పు అనేది విద్య నుంచే ప్రారంభం కావాలని ఆయన ఆకాక్షించారు. టీచర్స్‌ ట్రైనింగ్, కరిక్యులమ్, వర్క్‌బుక్స్, టెక్ట్స్‌బుక్స్‌ విషయంలో అధికారుల పనితీరును సీఎం అభినందించారు. విద్యార్థులకు మోరల్స్‌, ఎథిక్స్‌ క్లాసులు కూడా ఉండాలని చెప్పారు. దివ్యాంగుల కోసం పులివెందులలో వైఎస్సార్‌ ఫౌండేషన్‌ నడుపుతున్న విజేత స్కూల్‌ సక్సెస్‌ స్టోరీని అధికారులు సీఎం వద్ద ప్రస్తావించారు. దివ్యాంగులకు పాఠశాలలు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఒక రోజు ట్రైనింగ్‌ : మంత్రి ఆదిమూలపు
‘జగనన్న గోరుముద్ద’ మెనూ గురించి ఒక రోజు ట్రైనింగ్‌ ఇస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. కొంతమంది రిసోర్సింగ్‌ పర్సన్స్‌ను నియమిస్తామని వెల్లడించారు. నాడు-నేడులో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటుపై సమీక్షించామని తెలిపారు. వచ్చే వారంలోపు 15 వేల స్కూళ్లల్లో పనులు మొదలు పెడతామని చెప్పారు. 40 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందజేస్తామని మంత్రి తెలిపారు. రూ.100 కోట్లకు మించిన టెండర్లును జ్యూడీషియల్‌ రివ్యూకి ఇస్తామని మంత్రి తెలిపారు.
(చదవండి: నందిగం సురేష్‌పై దాడిని నిరసిస్తూ శాంతి ర్యాలీ)

Videos

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)