amp pages | Sakshi

కలెక్షన్ కింగ్

Published on Sun, 03/13/2016 - 03:25

నాకు అర్జెంట్ పని ఉంది. ఓ రూ.50 వేలు ఇవ్వు. మళ్లీ ఇస్తా!
నువ్వు కాల్‌మనీ వ్యాపారం చేస్తున్నావంట.. ఒక్కసారి నా వద్దకు వచ్చిపో!!
మీరిద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. కోర్టుల చుట్టూ ఎక్కడ తిరుగుతారు.. రండి హోటల్‌లో మాట్లాడుకుందాం!!! 
ఇదీ ఓ సీఐ వ్యవహారం

 
 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు:  స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులు తీసుకోకపోవడం.. కేవలం సెటిల్‌మెంట్లతో వ్యవహారాలు చక్కబెట్టడం.. తన కింద పనిచేస్తున్న ఎస్‌ఐతో కలిసి ఇసుక దందాకు తెగబడటం.. ఆ సీఐ బాగోతం ఎంత చెప్పినా తక్కువే. అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్న కొద్ది మంది వ్యాపారులను పిలిపించి కాల్‌మనీ పేరుతో బెదిరించి సుమారు రూ.10లక్షల నుంచి రూ.12 లక్షలు వసూలు చేశారు. ఇదే డబ్బుతో కొద్దిరోజుల క్రితం కారు కొన్న సదరు సీఐ ఎంచక్కా షికారు చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తం మీద కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ఆ సీఐ వ్యవహారం కాస్తా ఇప్పుడు డిపార్టుమెంట్‌లో చర్చనీయాంశమయింది. కొద్ది రోజుల క్రితం అవినీతి ఆరోపణలతో ఏకంగా నలుగురు సీఐలపై వేటు పడింది. ఇదే కోవలో ఈయనను కూడా తప్పిస్తారా? లేదో తేలాల్సి ఉంది.

బంగారు గొలుసు మాయం
కొద్దిరోజుల క్రితం సదరు సీఐ స్టేషన్ పరిధిలో ఒక బంగారు గొలుసు చోరీ అయింది. దీనిపై కేసు కూడా నమోదయింది. ఈ బంగారు గొలుసును దొంగలించిన దొంగను పట్టుకున్నారు కూడా. అయితే.. ఇప్పటి వరకు రికవరీ అయినట్టు ఎక్కడా చూపలేదు. ఎక్కడికెళ్లిందోనని ఆరా తీస్తే.. సీఐ గారి ఇంట్లో ప్రత్యక్షమయిందని తెలిసింది. ఈ వ్యవహారం స్టేషన్‌లో ఉన్న పోలీసులందరికీ తెలిసినా ఎవ్వరూ కిక్కురుమనలేని పరిస్థితి. అంతేకాకుండా ఎప్పుడు ఎవ్వరి మీద విరుచుకుపడతారో తెలియని ఆందోళన పరిస్థితులల్లో కిందిస్థాయి సిబ్బంది కూడా ఇబ్బందిగా కాలం వెళ్లదీస్తున్నారు.

తన కింద పనిచేసే ఒక ఎస్‌ఐతో కలిసి మొన్నటి వరకు ఇసుక దందాను ప్రోత్సహించారు. అయితే, ఇప్పుడు ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుండటంతో.. ఇసుక ట్రాక్టర్లపైన టార్పాలిన్లు కప్పలేదనే సాకుతో వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది.

Videos

అంతా మాయ..సేమ్ 2 సేమ్.. 2024 మోదీ ఎన్నికల స్పీచ్ పై డిబేట్

కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం

ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం

పచ్చ మద్యం స్వాధీనం..

బాబును నమ్మే ప్రసక్తే లేదు..

మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం

పవన్, బాబు, లోకేష్ పై జోగి రమేష్ పంచులు

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)