amp pages | Sakshi

జెడ్పీలో చాంబర్ లొల్లి

Published on Sat, 11/08/2014 - 03:41

సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా పరిషత్‌లో చాంబర్ లొల్లి కొనసాగుతోంది.  పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించి రెండు నెలలు కావస్తున్నా చాంబర్ ఏర్పాటు చేయలేదన్న ఆవేదనలో వైస్ చైర్మన్ వర్గీయులుండగా,   రెండు గదులు చూపించినా వాటిని కాదని తాను కోరుకున్న చోటే చాంబర్ ఏర్పాటు చేయాలంటూ వైస్ చైర్మన్ పట్టుబట్టడం సరికాదంటూ చైర్‌పర్సన్ వర్గీయులు వాదిస్తున్నారు.  ప్రస్తుతం దీనిపై రసవత్తర చర్చ జరుగుతోంది.

టీడీపీలోని ఓ వర్గ ఎమ్మెల్యేలు జెడ్పీలో మరో పవర్ సెంటర్ ఉండాలన్న వ్యూహాత్మక ఎత్తుగడతో పావులు కదిపారు. దీనిలో భాగంగా వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తికి ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేయాలని  పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును కోరారు. వైఎస్ చైర్మన్‌కు ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేయాలని  రెండు నెలల క్రితం జరిగిన ఓ సమావేశంలో  జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణికి మంత్రి నేరుగా సూచించారు.

ఈ నిర్ణయాన్ని చైర్‌పర్సన్ జెడ్పీలో చాంబర్ లొల్లి వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. ఎప్పుడూ లేని విధంగా వైస్ చైర్మన్‌కు ప్రత్యేక చాంబర్ ఏంటని డిఫెన్స్‌లో పడ్డారు. ప్రత్యర్థుల ఎత్తుగడగా భావించినప్పటికీ మంత్రి ఆదేశించిన తర్వాత తప్పదని వైస్ చైర్మన్‌కు ప్రత్యేక చాంబర్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.  తొలుత  జెడ్పీ ప్రాంగణంలో ఉన్న పాత భవనంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

అయితే దాన్ని వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి అంగీకరించలేదు. ప్రస్తుత పరిపాలన భవనంపై ఉన్న ప్రత్యేక రూమ్‌లోనే చాంబర్ ఏర్పాటు చేయాలని పట్టు బట్టారు. చైర్‌పర్సన్ కోసం కేటాయించిన రూమ్‌ను ఆయనకు కేటాయించాలని కోరడమేంటని చైర్‌పర్సన్ వర్గీయులు ఇరకాటంలో పడ్డారు. ఇప్పటికే చైర్‌పర్సన్ వాడుతున్నారని, అందులో వైస్ చైర్మన్‌కు చాంబర్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని సంకేతాలు పంపారు.   సమావేశం హాలు పక్కనే ఉన్న రూమ్‌లో చాంబర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.ఆ ప్రతిపాదనను కూడా వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి తిరస్కరించారు.

ప్రస్తుతం పరిపాలన భవనంపైన ఉన్న రూమ్‌లోనే ఏర్పాటు చేయాలని మొండికేసి కూర్చొన్నారు. దీంతో ఏకాభిప్రాయం కుదరక చాంబర్ లొల్లి ఏర్పడింది. మంత్రి ఆదేశించినా పట్టించుకోలేదని వైస్ చైర్మన్, ఆయన అనుకున్న చోటే కేటాయించాలని కోరడం సరికాదని చైర్‌పర్సన వర్గీయుల మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయి. దీంతో ఆ రెండు వర్గాల మధ్య   అంతరం పెరుగుతోంది. రాజకీయ ఆధిపత్యం కోసం ఇప్పటికే కొనసాగుతున్న పోరాటంలో ఈ చాంబర్ లొల్లి ఏ మేర ప్రభావం చూపుతుందో, ఎక్కడికి దారితీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

Videos

మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?